Tax Saving Tips: ట్యాక్స్ ఆదా చేసేందుకు చాలా పద్ధతులున్నాయి. అందులో అతి ముఖ్యమైంది చాలామందికి తెలియంది కూడా ఉంది. మీ భార్యత కలిసి జాయింట్ లావాదేవీ నిర్వహించడం ద్వారా పెద్దమొత్తంలో ట్యాక్స్ సేవ్ చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇందుకోసం 3 పద్ధతులున్నాయంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఉన్న కొన్ని వెసులుబాట్ల గురించి తెలుసుకోగలిగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఒకరికొకరు ఆర్ధికంగా తోడ్పాటు అందించుకున్నట్టే జాయింట్ ఎక్కౌంట్‌తో కలిసి లావాదేవీలు నిర్వహించడం వల్ల చాలా లాభాలుంటాయి. పెద్దమొత్తంలో ట్యాక్స్ సేవ్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీ భార్య కూడా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీ భార్యతో కలిసి జాయింట్ లావాదేవీ నిర్వహిస్తే 3 పద్దతుల ద్వారా 7 లక్షల వరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. 


మీ భార్య చదువు కొనసాగించే ఉద్దేశ్యముంటే ఆమె పేరుతో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ట్యాక్స్ పరంగా మినహాయింపు పొందవచ్చు. ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీకు 8 ఏళ్ల పాటు మినహాయింపు లభిస్తుంది. ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 80ఇ ప్రకారం ఈ మినహాయింపు వర్తిస్తుంది. అది కూడా బ్యాంక్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి స్టూడెంట్ లోన్ రూపంలో తీసుకోవాలి.


స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలిక పెట్టుబడితో ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు 1 లక్ష రూపాయల వరకూ లాభాలపై ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. మీ భార్య ఆదాయం తక్కువగా ఉంటే మీరే ఆమెతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిస్తే ఇన్‌కంటాక్స్ మినహాయింపు పొందవచ్చు. మీరు నేరుగా కూడా కొంతమొత్తం స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరో లక్ష రూపాయలు ట్యాక్స్ ఆదా చేయవచ్చు. అంటే మొత్తం 2 లక్షల వరకూ ట్యాక్స్ ఆదా అవుతుంది.


ఏదైనా ఇంటిని లేదా స్థలం కొనుగోలు చేసినప్పుడు ఇద్దరి పేరుపై రిజస్టర్ చేసి తీసుకోవడం వల్ల ట్యాక్స్ పరంగా ప్రయోజనాలు పొందవచ్చు. జాయింట్ ఎక్కౌంట్‌తో హౌస్ లోన్ తీసుకోవడం వల్ల రెట్టింపు ట్యాక్స్ ప్రయోజనాలుంటాయి. ఇద్దరూ చెరో 1.5 లక్షల వరకూ అంటే మొత్తం 3 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 24 ప్రకారం చెరో 2 లక్షలు వడ్డీపై మినహాయింపు పొందవచ్చు. మొత్తం 7  లక్షల వరకూ ట్యాక్స్ ఆదా చేయవచ్చు.


Also read: Pension Distribution: పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు విడుదల, పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తారంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook