New Tax Regime: న్యూ ట్యాక్స్ రెజీమ్ ఎంచుకునేవారికి ప్రభుత్వం కొంత మినహాయింపు ఇస్తోంది. దీనికోసం చట్టంలో కొన్ని సవరణలు సైతం చేసింది. దీని ప్రకారం మీ ఆదాయం 7 లక్షల కంటే కొద్దిగా అధికమైతే..అదనంగా ఉన్న ఆదాయంపై మాత్రమే ట్యాక్స్ చెల్లించే అవకాశం కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్ధిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ


లోక్‌సభ ఆర్ధిక బిల్లు 2023ను ఆమోదించింది. ఇందలో న్యూ ట్యాక్స్ రెజీమ్ ట్యాక్స్ పేయర్లకు కొంత మినహాయింపు ఇస్తూ సవరణలు చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త ట్యాక్స్ విధానం అమలు కానుంది. 


7 లక్షల కంటే కొద్దిగా ఎక్కువ ఆదాయమైతే..


న్యూ ట్యాక్స్ రెజీమ్ కింద ఒకవేళ ఎవరి వార్షిక ఆదాయమైనా 7 లక్షలుంటే ఏ విధమైన ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఆదాయం 7 లక్షల 100 రూపాయలుంటే దీనిపై 25010 రూపాయలు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 100 రూపాయలు అదనంగా ఉన్న కారణంగా 25010 రూపాయలు పన్ను చెల్లించాల్సిన పరిస్థితి. అందుకే మినహాయింపు ఇవ్వాలని ప్రతిపాదించారు. తద్వారా 7 లక్షల కంటే స్వల్పంగా ఆదాయం ఎక్కువైతే అదనంగా ఉన్నదానిపై మాత్రమే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 


2023-24 కేంద్ర ఆర్దిక బడ్జెట్ ప్రకటనలో న్యూ ట్యాక్స్ రెజీమ్ ప్రకారం వార్షిక ఆదాయం 7 లక్షలున్నవాళ్లు ఏ విధమైన ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ఉంది. ఈ విధానం ట్యాక్స్ పేయర్లు కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంచుకునేలా చేస్తోంది. న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో పెట్టుబడులపై ఏ విధమైన మినహాయింపు ఉండదు.


ఆర్ధిక బిల్లులో సవరణల ద్వారా ప్రభుత్వం ట్యాక్స్ పేయర్లకు కొద్దిగా మినహాయింపు ఇచ్చేందుకు సంకల్పించింది. 7 లక్షల కంటే ఎక్కువగా ఎంత ఆదాయమున్నా ఇది వర్తిస్తుంది. ఒకవేళ వార్షిక ఆదాయం 7 లక్షల 27, 777 రూపాయల వరకూ ఉంటే అదనంగా ఉన్న మొత్తంపైనే ట్యాక్స్ వర్తించేలా కొత్తగా సవరణలు జరిగాయని తెలుస్తోంది. 


Also read : Pan Aadhaar Link: మీ పాన్‌కార్డును ఆధార్‌తో లింక్ చేశారో లేదో గుర్తు లేదా, ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook