మారుతీ సుజుకీ కస్టమర్లకు బంపర్ ఆఫర్
మారుతి సుజుకీ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండియన్ బ్యాంకు ద్వారా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తోంది.
మారుతీ సుజుకీతో ఒప్పందం కుదర్చుకొని వినియోగదారులకు కార్ లోన్స్ అందించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. కారు కొనుక్కోవాలనుకునే వాళ్లకు లాభం చేకూర్చే విధంగా మారుతీ సుజుకీ, ఇండియన్ బ్యాంకు భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కార్ లోన్స్ తీసుకునే వారికి జీరో ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఉచితంగా ఫాస్ట్‌ట్యాగ్ లాంటి సదుపాయాలు అందిస్తోంది. వినియోగదారులకు లాభదాయకమైన ఫైనాల్సింగ్ అందించేందుకు ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో కస్టమర్లకు అవాంతరాలు లేని, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ సదుపాయం కలగుతోంది.
దేశవ్యాప్తంగా ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఇండియన్ బ్యాంకుకు చెందిన 5,700 బ్యాంకు కార్యాలయాల ద్వారా ఈ భాగస్వామ్యం ఒప్పందం ఆధారంగా రుణాలు అందనున్నాయి. మారుతీ సుజుకీ కారుని కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఈ బ్యాంకుల ద్వారా సేవలను వినియోగించుకోవచ్చు. ఈ పథకం ద్వారా మారుతీ సుజుకీ కారు కొనాలనుకూనే వాళ్లు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు ఇండియన్ బ్యాంకు ద్వారానే రుణాల రూపంలో నిధులు నమకూర్చుకోవచ్చు. వడ్డీ రేట్లు కూడా ఆకర్శనీయంగానే ఉన్నాయని ఇండియన్ బ్యాంకు ప్రకటించింది. ఈఎంఐ స్లాట్ ను కూడా వినియోగదారులే ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఇరు సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కొనుగోలుదారులు రూ.30 లక్షల వరకు ఉచిత ప్రమాద బీమా పాలసీని పొందవచ్చ. ఈ పథకం 30 జూన్ 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఇరు సంస్థలు ప్రకటించాయి. ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల్లో 80% అమ్మకాలు రిటైల్ ద్వారానే జరుగుతున్నాయి.
వినియోగదారులకు మరింత చేరువ అయ్యేందుకు మారుతీ సుజుకీ గతంలో కూడా పలు ప్రభుత్వ, ప్రయివేట్ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ కోవలనే ఇప్పుడు ఇండియన్ బ్యాంకుతో అగ్రిమెంట్ చేసుకుంది. ఇటు మారుతీ సుజుకీకి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉంది. మరోవైపు అటు ఇండియన్ బ్యాంకుకు కూడా దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖలు ఉన్నాయి. దీంతో దేశంలో ఎక్కడ ఉన్నా మారుతీ సుజుకీ కస్టమర్లకు ఇబ్బంది ఉండదని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.
also read
WiFi Tricks:వైఫై పాస్‌వర్డ్ మర్చిపోయారా?టెన్షన్ పడకండి..అయితే ఈ ట్రిక్ మీకు కోసమే
WhatsApp Cashback: వాట్సాప్ పేమెంట్స్‌తో భారీగా క్యాష్‌బ్యాక్.. పొందండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook