How To Identify Fake Rs 500 Note: రూ.2 వేల నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా ఉపసంహకరించుకోవడంతో రూ.500 నోటు పెద్ద నోటుగా మారింది. ప్రజలు ఈ నెల 30వ తేదీలోపు రూ.2000 నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసి ఇప్పటికే ఆర్‌బీఐ మార్చుకోవాలని సూచించింది. ఇప్పటివరకు 90 శాతానికి పైగా రూ.2000 నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. మిగిలిన వారు ఇంకా ఎవరైనా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా మార్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నకిలీ రూ.500 నోట్లు ఇటీవల ఎక్కువగా చెలమాణి అవుతున్న విషయం తెలిసిందే. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.500 నోటు నకిలీదో కాదో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒరిజనల్ నోటును ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> నోటుపై రూ.500 డినామినేషన్ రాసి ఉంటుంది
==> రూ.500 విలువ సీక్రెట్‌గా ముద్రించి ఉంటుంది
==> ఐదు వందలు అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది
==> మధ్యలో మహాత్మా గాంధీ బొమ్మ ఉంటుంది
==> భారత్ (దేవనాగరిలో), 'ఇండియా' చిన్న ముద్రణలో రాసి ఉంటుంది
==> 'భారత్' (దేవనాగరిలో), 'ఆర్‌బీఐ' శాసనాలతో భద్రతా థ్రెడ్ (స్ట్రిప్) ఉంటుంది. దాని కలర్ కూడా ఛేంజ్ అవుతుంది. మీరు నోట్‌ను కొద్దిగా వంచితే.. సెక్యూరిటీ థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుంచి బ్లూ కలర్‌లోకి మారుతుంది.
==> గ్యారెంటీ క్లాజ్, ప్రామిస్ క్లాజ్‌తో పాటు గవర్నర్ సంతకం, మహాత్మా గాంధీ ఫొటో రైట్ సైడ్ నుంచి ఆర్‌బీఐ చిహ్నం ఉంటుంది.
==> మహాత్మా గాంధీ చిత్రపటం, ఎలక్ట్రోటైప్ వాటర్‌మార్క్ (500) ఉంటుంది.
==> ఎగువ ఎడమ, దిగువ కుడి వైపున పెరుగుతున్న సంఖ్యలతో నంబర్ ప్యానెల్ ఉంటుంది.
==> దిగువన కుడి వైపున కలర్ ఛేంజ్ అవుతున్న ఇంక్‌లో (ఆకుపచ్చ నుంచి నీలం) రూపాయి చిహ్నం (రూ.500)తో పాటు డినామినేషన్ అంకె ఉంటుంది.
==> కుడి వైపున అశోక స్తంభం గుర్తు ఉంటుంది.
==> దృష్టి లోపం ఉన్నవారి కోసం కొన్ని గుర్తులు ఉంటాయి.  
==> మహాత్మా గాంధీ పోర్ట్రెయిట్ (4), అశోక స్తంభం చిహ్నం (11), కుడి వైపున రూ.500 మైక్రోటెక్స్‌తో వృత్తాకార గుర్తింపు గుర్తు, ఎడమ, కుడి వైపులా ఐదు కోణీయ బ్లీడ్ లైన్లు ఉంటాయి.
==> ఎడమవైపు నోటు ఏ సంవత్సరంలో ముద్రించారో రాసి ఉంటుంది.
==> ఇది ఎర్రకోట ఆకారంలో ఉంటుంది.
==> దేవనాగరిలో సింబాలిక్ సంఖ్య 500 ఉంటుంది.


Also Read: Jawan OTT Release Update: దిమ్మతిరిగే రేటుకు జవాన్ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?  


Also Read: Nipah Virus Latest Updates: ముంచుకొస్తున్న నిపా వైరస్ ముప్పు.. మరో ఇద్దరు మృతి.. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook