ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల చాలాసార్లు రెపో రేటు పెంచింది. ఫలితంగా దేశంలోని అన్ని బ్యాంకులు వడ్డీరేట్లను పెంచేశాయి. ఇప్పుడీ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం కలగవచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఈ వారంలో జరిగి ఎంపీసీ సమావేశంలో వడ్డీరేట్లను తగ్గించేందుకు నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. వరుస మూడు సమావేశాల్లో ఆర్బీఐ 50 బేసిస్ పాయింట్ల చొప్పున పెంచింది. అంటే ద్రవ్యోల్బణం కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఈ ఏడాది మే నుంచి రెపో రేటును 190 బేసిస్ పాయింట్లు పెంచింది. 


ఈసారి బేసిస్ పాయింట్లను 50 వరకూ కాకుండా 25-30 వరకూపెంచవచ్చని అంచనా ఉంది. అంటే పెంపు రేటును కాస్త తగ్గించనుంది. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో ప్రతికూల ప్రభావం తగ్గించేందుకు వడ్డీ రేట్ల పెంపు తగ్గించాలనేది అసోచామ్ అభ్యర్ధనగా ఉంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రెపో రేటు 6.5 శాతంగా ఉంది. ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్లు పెంచిన తరువాత..2023 ఫిబ్రవరిలో మరోసారి రెపో రేటు పెంచవచ్చు. 


Also read: Airtel plans updates: ఎయిర్‌టెల్ ఆ మూడు ప్లాన్లతో ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో ఉచితం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook