Visa Free Countries: ఇండియన్ పాస్‌పోర్ట్ విలువ, ఈ 62 దేశాలకు వీసా లేకుండానే వెళ్లి రావచ్చు
Visa Free Countries: ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఆ దేశం ఇచ్చే అనుమతి వీసా. కొన్ని దేశాలు ఇంకొన్ని దేశాలకు ఈ వీసా నుంచి మినహాయింపు ఇస్తుంటాయి. అదే విధంగా భారతీయులు కూడా కొన్ని దేశాకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు. ఆ వివరాలు మీ కోసం..
Visa Free Countries: ప్రపంచంలో భారతదేశ పాస్‌పోర్ట్ విలువ అంతకంతకూ పెరుగుతోంది. ప్రతి దేశం పాస్‌పోర్ట్‌కు అంతర్జాతీయంగా ర్యాంకింగ్ ఉంటుంది. ఈ ర్యాంకింగ్‌లో ఇండియన్ పాస్‌పోర్ట్ స్థానం 80. పాకిస్తాన్ అన్నింటికంటే బలహీనమైన పాస్‌పోర్ట్‌లలో 4వ స్థానంలో ఉంది. కానీ ఇండియా పాస్‌పోర్ట్ విలువ ఎక్కువే. ప్రపంచంలో 6 దేశాల పౌరులు వీసా లేకుండా 194 దేశాలు చుట్టి రావచ్చు.
పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో అన్నింటికంటే దిగువన ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశస్థులు కేవలం 28 దేశాలకే వీసా లేకుండా వెళ్లేందుకు వీలుంటుంది. అదే విధంగా సిరియా దేశస్థులు వీసా లేకుండా 29 దేశాలకు వెళ్లేందుకు వీలుంటే..ఇరాక్ ప్రజలు 31 దేశాలు వెళ్లవచ్చు. పాకిస్తాన్ దేశస్తులు 34 దేశాలు తిరిగిరావచ్చు. అత్యంత వరస్ట్ ర్యాంకింగ్ సొంతం చేసుకున్న ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో నేపాల్, పాలస్తీనా, సోమాలియా, యెమెన్, ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్, లిబియా ఉన్నాయి.
వీసా లేకుండా భారతీయులకు 62 దేశాల్లో ఫ్రీ ఎంట్రీ
అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటీష్ విర్జిన్ ఐలాండ్స్, బురుండి, కంబోడియా, కేబ్ వెర్డ్ ఐలాండ్స్, కోమ్రో ఐలాండ్స్, కుక్ ఐలాండ్స్, డ్జిబోటి, డొమినికా రిపబ్లిక్, ఎల్ సాల్వెడార్, ఫిజి, గాబన్, గ్రెనడా, గినియా బిస్సావ్, హైతి, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావ్, మెడగాస్కర్, మలేషియా, మాల్దీవ్స్, మార్షల్ ఐలాండ్స్, మారిటేనియా, మారిషస్, మైక్రోసియా, మోంటేసెర్రాట్, మయన్మార్, మొజాంబిక్, నేపాల్, నియూ, ఒమన్, పలావ్ ఐలాండ్, కతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీచెల్లెస్, సియారా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజేనియా, థాయిలాండ్, టిమోర్, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, టువాలు, వనాటు, జింబాబ్వే, గ్రెనడా,
ప్రపంచంలో 194 దేసాల్ని వీసా లేకుండా చుట్టి వచ్చే శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేసాలు 6 మాత్రమే ఉన్నాయి. అవి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్. ఈ ఆరు దేశాల తరువాత ఫిన్‌లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ దేశాలు వస్తాయి. ఇక వీటి తరువాత ర్యాంకింగ్ కలిగిన దేశాలు ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లగ్జంబర్గ్, నార్వే, పోర్చుగల్, యూకేలు ఉన్నాయి
Also read: Paytm Issue: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఆ సంస్థ చేజిక్కించుకోనుందా, అసలేం జరుగుతోంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook