Railway Bonus 2022: లక్షలాది ఉద్యోగుల ఖాతాల్లో భారీగా డబ్బులు  పడనున్నాయి. రేపు జరగనున్న కేంద్ర కేబినెట్‌లో దీపావళి బోనస్ నిర్ణయం తీసుకోనున్నారు. ఖాతాల్లో ఎంత మొత్తం డబ్బులు పడనున్నాయంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని 11 లక్షల రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వం త్వరలోనే రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించనుంది. మీడియా నుంచి వస్తున్న సమాచారం ప్రకారం రేపు అంటే సెప్టెంబర్ 28న జరగనున్న కేబినెట్ భేటీలో బోనస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి దీపావళి కానుక పెద్దమొత్తంలో ఉండనుంది.


సెప్టెంబర్ 28వ తేదీ అంటే రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్ లింక్డ్ బోనస్‌పై ఆమోదం లభించనుంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల బోనస్ ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 11 లక్షలమంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 


రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్ లింక్డ్ బోనస్‌పై ఆమోదం లభించనుంది. కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో 2 వేల కోట్ల అదనపు ఖర్చు ఉంటుంది. రైల్వే బోర్డు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. రేపు జరిగే కేబినెట్ భేటీలో దీనిపై ఆమోదముద్ర పడవచ్చు. 


రైల్వే ఉద్యోగులకు పీఎల్బీ వర్తించేందుకు నిర్ధారిత జీతం దాదాపు 7 వేల రూపాయలు ప్రతి నెలా ఉండాలి. అంటే 78 రోజుల బోనస్ ఖాతాలో జమ అయితే..అత్యధికంగా 17,951 రూపాయలు ఎక్కౌంట్లో జమ అవుతాయి. గత ఏడాది 2021లో రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్ అందింది. ఒక్కొక్క ఉద్యోగికి 30 రోజుల చొప్పున 7 వేల రూపాయలు బోనస్ వచ్చింది. అంటే 18 వేల వరకూ అందింది.


Also read: EPFO Interest Credit: పీఎఫ్ ఖాతాల్లో జమ కానున్న 81 వేల రూపాయలు, ఎప్పుడు, ఎలాగో తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook