Mizoram Railway Station: మన దేశంలో రైళ్లకు ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలోనే నాల్గో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ మనది. నిత్యం లక్షలాది మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నారు. రైల్వే నెట్‌వర్క్ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లోనూ విస్తరించింది. దూర ప్రయాణాలకు చాలా మంది ట్రైన్ జర్నీనే ఇష్టపడుతున్నారు. తక్కువ ధరలో ముందుగానే బెర్త్‌లు బుక్ చేసుకుని.. హ్యాపీగా పడుకుని వెళ్లే అవకాశం ఉండడంతో రైళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రయాణం కూడా సేఫ్‌గా ఉండడంతో రైళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అనేక జిల్లాల్లో ఒకటి కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లు ఉండగా.. ఒక రాష్ట్రంలో మాత్రం ఒకటే రైల్వే స్టేషన్ ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ ఉన్న బైరాబీ రైల్వే స్టేషన్‌ ద్వారానే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. మిజోరాం రాష్ట్రానికి రైలు కనెక్టివిటీ మార్గం ఈ ఒక్క స్టేషన్‌కే ఉంది. ఈ స్టేషన్ ద్వారానే దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించారు. ప్రయాణం కోసమైనా.. సరుకు రవాణాకు అయినా ఈ స్టేషన్‌కు రావాల్సిందే. రైల్వే ట్రాక్ ఈ స్టేషన్ వరకే మాత్రమే ఉంది. ఈ స్టేషన్‌ను రాష్ట్రంలోని చివరి రైల్వే స్టేషన్ అని కూడా పిలుస్తారు. 


బైరాబీ రైల్వే స్టేషన్ కోడ్ BHRB. ఈ స్టేషన్‌లో 4 రైల్వే ట్రాక్‌లు, 3 ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఏకైక రైల్వేస్టేషన్ అయినా.. సౌకర్యాలు మాత్రం నిల్ అని చెప్పొచ్చు. బైరాబీ స్టేషన్ మొదట్లో చిన్న రైల్వే స్టేషన్‌గా ఉండేది. 2016 సంవత్సరం నుంచి అభివృద్ధి చేస్తూ.. సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. ఇంకా పూర్తిస్థాయిలో ఆధునిక వసతులు అందుబాటులోకి రాలేదు. 


మిజోరం దట్టమైన అడవులు, కొండలతో కూడిన రాష్ట్రం. దీంతో అక్కడ రైల్వే ట్రాక్‌లు నిర్మించేందుకు సమస్యగా మారింది. ఈ రాష్ట్రంలో సేవల విస్తరించేందుకు ఇండియన్ రైల్వేస్ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మరో రైల్వే స్టేషన్‌కు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదేవిధంగా ట్రాక్‌ల విస్తరణకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుగుతోంది. రానున్న కాలంలో అక్కడ కూడా రైలు నెట్‌వర్క్ మిజోరాంలో మరింత భారీగా పెరగనుంది.


Also Read: Akash Madhwal IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆకాశ్ మధ్వాల్.. ముంబై ఎంత ఖర్చు చేసిందంటే..?  


Also Read: TS EAMCET Results 2023: విడుదలైన ఎంసెట్ ఫలితాలు, ఈ https://eamcet.tsche.ac.in/ లింక్ తో నిమిషంలో రిజల్ట్ పొందండి!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook