Vande Sadharan Train Facilities: మన దేశంలో రైళ్లలో ఎక్కువగా ప్రయాణించేది పేదలు, మధ్య తరగతి ప్రజలే. వీరిని దృష్టిలో ఉంచుకుని వందే సాధారణ్‌ రైళ్లను తీసుకువస్తున్నట్లు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం ఈ రైలు కోచ్‌లను తయారు చేస్తున్నారు. వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలోనే చేరుకుంటున్నారు. ఈ రైలుకు డిమాండ్ బాగానే ఉన్నా.. సామాన్య ప్రజలు ఈ రైళ్లవైపు చూడడం లేదు. జనరల్ కోచ్‌లు లేకపోవడం.. ఛార్జీలు కూడా ఎక్కువగా ఉండడంతో సాధారణ ప్రజలు వందే భారత్‌ రైళ్లు ఎక్కడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలు కోచ్‌లను తయారు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వందే సాధారణ్‌ రైలు సిద్ధం కానున్నట్లు తెలిసింది. ఈ రైలులో 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్స్ వంటి ఫీచర్లను రూపొందించనున్నారు. దీంతో పాటు రైలులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే ఈ రైలు వేగం ఎక్కువగా ఉంటుంది. అయితే తక్కువ స్టాపుల్లోనే ఆగనుంది. ఒక రైలు తయారీకి దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు తెలిసింది. 


ఈ రైలు గురించి రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. వందే భారత్, వందే సాధారణ్‌ రైళ్ల మధ్య తేడా ఉంటుందని చెప్పారు. ఈ రైలు కూడా శతాబ్ది, జన శతాబ్ది లాగా ఉంటుందని తెలిపారు. శతాబ్ది రైలు ప్రారంభించినప్పుడు ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని.. కానీ సాధారణ ప్రజల కోసం రైల్వే శాఖ జన శతాబ్ది రైలును ప్రారంభించిందని గుర్తు చేశారు. జన శతాబ్ది ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు అదే తరహాలో వందే భారత్‌లో ఛార్జీలు ఎక్కువగా ఉంటున్నాయని.. కానీ వందే సాధారణ్‌ రైళ్లలో ఛార్జీలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు. తొలి రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం అయ్యే అవకాశం ఉందన్నారు.  


ఇక వందే భారత్ విషయానికి వస్తే.. ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే విమర్శలు ఉన్నాయి. వందే భారత్ సగటు వేగం గంటకు 83 కిలోమీటర్లే ఉండడంతో మిగిలిన రైళ్ల ప్రయాణంతో పోలిస్తే.. మరీ అనుకున్నంత తొందర గమ్యస్థానానికి చేరుకోవట్లేదని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. అదే డబ్బులతో ఇతర రైళ్లలో ఏసీ స్లీపర్ కోచ్‌లో హాయిగా పడుకుని వెళ్లొచ్చని కొందరు మొగ్గు చూపడం లేదు. అయితే వందే భారత్‌ డిమాండ్ పెంచేందుకు త్వరలోనే స్లీపర్ కోచ్‌లనూ తీసుకువస్తున్న విషయం తెలిసిందే.


Also Read: Telangana Medical Colleges: దేశానికే ఆదర్శంగా తెలంగాణ వైద్యరంగం.. నూతన మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్


Also Read:  Nipah Virus Cases: కేరళలో హై అలర్ట్.. 6కి చేరిన నిఫా వైరస్ కేసులు, ఇద్దరు మృతి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook