Bank FD Rates: దేశంలోని 4 అతి పెద్ద బ్యాంకులు ఎఫ్‌డీలపై ఇచ్చే వడ్డీ ఎంతో తెలుసా
Bank FD Rates: బ్యాంకులైనా లేదా పోస్టాఫీసులైనా సరే ఎక్కువ మంది ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇదే సురక్షితమైందని భావిస్తుంటారు. ఎందుకంటే వీటిపై గ్యారంటీ రిటర్న్స్ ఉండటమే కాకుండా రిస్క్ ఏ మాత్రం ఉండదు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Bank FD Rates: దేశంలోని వివిధ బ్యాంకుల్లో వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎలాంటి రిస్క్ ఉండదు. రిటర్న్స్ అద్భుతంగా ఉంటాయి. డబ్బు పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఎఫ్‌డీలపై అత్యధికంగా 8 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నాయి. అందుకే ఎఫ్‌డీ చేసే ముందు ఏ బ్యాంకులో ఎంత వడ్డీ లభిస్తుందో తెలుసుకోవడం అవసరం.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వివిధ రకాల ఎఫ్‌డీలపై 7.75 శాతం నుంచి 8 శాతం వడ్డీ చెల్లిస్తున్నాయి. చిన్న తరహా ఫైనాన్స్ బ్యాంకులైతే 9.21 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నాయి. అత్యధికంగా వడ్డీ చెల్లించే 4 అతి పెద్ద బ్యాంకుల గురించి తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డి వడ్డీ రేటు
7 రోజుల్నించి 45 రోజుల కాల వ్యవధి ఎఫ్‌డీలపై సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.5 శాతం వడ్డీ చెల్లిస్తుంది. ఇక 46 రోజుల్నించి 179 రోజుల వరకైతే సాధారణ పౌరులకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5 శాతం వడ్డీ లభిస్తుంది. 180 రోజుల్నించి 210 రోజుల వరకూ సాధారణ పౌరులకు 5.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.75 శాతం వడ్డీ లభిస్తుంది. 211 రోజుల్నించి 1 ఏడాది వరకూ సాధారణ పౌరులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ చెల్లిస్తుంది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల కాల వ్యవధిలో సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ ఇస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎఫ్‌డి వడ్డీ రేటు
7 రోజుల్నించి 14 రోజుల కాల వ్యవధిలో సాధారణ పౌరులకు 3 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం వడ్డీ ఉంటుంది. 6 నెలల 1 రోజుంచి 9 నెలల్లోపు కాల వ్యవధికి సాధారణ పౌరులకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. 1 ఏడాది నుంచి 15 నెలలకు అయితే సాధారణ పౌరులకు 6.60 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ లభిస్తుంది. 18 నెలల్నించి 21 నెలలకు అయితే సాధారణ పౌరులకు 7.25 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఉంటుంది.
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా అత్యదికంగా సాధారణ పౌరులకు 7.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తోంది. ఈ బ్యాంకులో కూడా కాల వ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంటుంది. ఇక ఐసీఐసీఐ బ్యాంకులో సైతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వివిధ రకాలుగా ఉంది. సాధారణ పౌరులకు గరిష్టంగా ఐసీఐసీఐ బ్యాంకు 7.10 శాతం వడ్డీ చెల్లిస్తుంటే, సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.60 శాతం వడ్డీ ఇస్తోంది. అందుకే ఎఫ్‌డీ చేసేముందు ఏ బ్యాంకులో ఎంత కాల వ్యవధికి ఎంత వడ్డీ ఉందో లెక్కేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది.
Also read: Vande Bharat Sleeper Trains: త్వరలో పట్టాలెక్కనున్న 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook