Best Mileage SUV: అత్యధిక మైలేజ్, అద్భుత ఫీచర్లతో దుసుకుపోతున్న బెస్ట్ ఎస్‌యూవీ ఇదే
Best Mileage SUV: ఇటీవలి కాలంలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలకు అనువుగా ఉండటంతో హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్ల కంటే ఎస్‌యూవీలంటే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫీచర్లతో అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీ గురించి తెలుసుకుందాం.
Best Mileage SUV: మారుతి సుజుకి కార్లంటే దేశంలో ప్రత్యేకమైన నమ్మకం. మారుతి సుజుకి మూడేళ్ల క్రితం లాంచ్ చేసిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా బెస్ట్ ఎస్‌యూవీగా నిలిచింది. ఇదొక హైబ్రిడ్ ఇంజన్ కారు. అద్భుతమైన మైలేజ్ ఇస్తుంది. ఇందులో పెట్రోల్-ఎలక్ట్రిక్ మోటార్ రెండు రకాల హైబ్రిడ్ ఇంజన్ ఉండటంతో ప్రయాణీకులకు బడ్జెట్ చాలా కలిసొస్తుంది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారాలో 1.5 లీటర్ సిలెండర్ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్‌తో పాటు శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. మారుతి కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర 10 లక్షల 99 వేలు ప్రారంభధరగా ఉంది. ఇందులో 6 వేరియంట్లు ఉన్నాయి. సిగ్మా, డెల్టా, జెటా, జెటా ప్లస్, ఆల్ఫా, ఆల్ఫా ప్లస్ ఉన్నాయి. హైబ్రిడ్ పవర్ ట్రెన్ ఆప్షన్ అందుబాటులో ఉంది. డెల్టా, జెటా ట్రిమ్స్ మేన్యువల్ వేరియంట్ ఇప్పుడు సీఎన్జీ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంది. ఈ కారులో 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఏంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్, హెడ్ అప్ డిస్‌ప్లే ఉన్నాయి.
ఇవి కాకుండా ఇందులో సెక్యూరిటీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఈబీడీ విత్ ఏబీఎస్, టైర్ ప్రెషర్ మోనిటరింగ్ సిస్టమ్ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో 360 డిగ్రీల కెమేరా, హిల్ అసిస్ట్ కంట్రకోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. హైబ్రిడ్ కారు అయినందున ఒకటి కంటే ఎక్కువ ఎనర్జీ సోర్స్ ఆధారంతో పనిచేస్తుంది. పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్, ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ ఉంటుంది. వాహనం నడపడంలో రెండూ కలిసి పనిచేస్తాయి. మధ్య మధ్యలో కేవలం ఎలక్ట్రిక్ ఇంజన్‌తోనే పనిచేస్తుంది. ఫలితంగా ఫ్యూయల్ తక్కువ ఖర్చవుతుంది. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ మెరుగ్గా ఉంటుంది.
ప్రస్తుతం దేశంలో మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్లకు చాలా డిమాండ్ నడుస్తోంది. అందులో మారుతి సుజుకి గ్రాండ్ విటారా పేరు ప్రముఖంగా చెప్పవచ్చు. అద్భుతమైన ఫీచర్ల కలిగి ఉండి, ఎక్కువ మైలేజ్ ఇస్తుండటంతో ఎస్‌యూవీ కొనుగోలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్‌గా కన్పిస్తుంది.
Also read: Heavy Rains Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.