Fedex CEO: మరో దిగ్గజ సంస్థకు భారతీయుడి నాయకత్వం- ఫెడ్ఎక్స్ సీఈఓగా రాజ్ సుబ్రమణియం
Fedex CEO: మరో భారతీయుడు.. అంతర్జాతీయ దిగ్గజ సంస్థకు సీఈఓగా ఎంపికయ్యారు. కేరళకు చెందిన ఇండో అమెరికన్ రాజ్ సుబ్రమణియన్ ఫెడ్ఎక్స్ సీఈఓగా నియమితులయ్యారు. రాజ్ సుబ్రమణియంకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Fedex CEO: అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులు నాయకత్వం వహించడం క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో అంతర్జాతీయ దిగ్గజ సంస్థకు భారతీయ అమెరిక్ సీఈఓగా నియమితులయ్యారు. ప్రముఖ కొరియర్ సర్వీసుల సంస్థ ఫెడ్ఎక్స్కు సీఈఓగా రాజ్ సుబ్రమణియం ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కొరియర్ డెలివరీ సంస్థ ఫెడ్ఎక్స్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది.
ప్రస్తుతం ఛైర్మన్, సీఈఓగా ఉన్న ఫెడ్రిక్ డబ్ల్యూ స్మిత్ జూన్ 1న ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. దీనితో ఆయన స్థానంలో రాజ్ సుబ్రమణియం ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పు తర్వాత ఫెడ్రిక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సేవలందించనున్నారు.
భవిష్యత్ గురించి మేను ఆలోచించినప్పుడు.. రాజ్ సుబ్రమణియం నాయకత్వం ఫెడ్ఎక్స్కు విజయవంతంగా ముందుకు సాగుతుందని మేము భావిస్తున్నారు. రాజ్ సుబ్రమణియన్‌కు.. ఆ సామర్థ్యం ఉందని ధీమా వ్యక్తం చేశారు ఫెడ్రిక్ డబ్ల్యూ స్మిత్. ఫెడ్ఎక్స్ వ్యవస్థాపకుడు కూడా ఫెడ్రిక్ డబ్ల్యూ స్మిత్ కావడం గమనార్హం. 1971లో ఈ సంస్థను స్థాపిచారు.
ఫెడ్ఎక్స్ గురించి..
ఫెడ్ఎక్స్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని టెన్నెస్సిలో ఉంది. ఈ సంస్థకు ప్రపచవ్యాప్తంగా 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.
రాజ్ సుబ్రమణియన్ గురించి..
ఫెడ్ఎక్స్కు సీసీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు.. ఫెడ్ఎక్స్ ఎక్స్‌ప్రెస్ విభాగానికి సీఈఓగా ఉన్నారు. దీనితో పాటు ఫెడ్ఎక్స్ కార్ప్ ఉపాధ్యక్షుడిగా, చీఫ్ మార్కెటింగ్, కమ్యునికేషన్ ఆఫీసర్‌గా పని చేశారు. ఫెడ్‌ఎక్స్‌లో ఆయన 1991లో చేరారు.
రాజ్ సుబ్రమణియం స్వస్థలం కేరళలోని తిరువనంతపురం. ఆయన ఐఐటీ బాంబే నుంచి కేమికలక్ ఇంజినీరింగ్ పొందిన తర్వాత.. మాస్టర్స్కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంబీఏ చేశారు.
Also read: Todays Gold Rate: బంగారం ధరలో తగ్గుదల, దేశంలో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook