ఇరకాటంలో ఇన్ఫోసిస్...ఆరా తీస్తున్న కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ పై కేంద్రానికి ఫిర్యాదు వెళ్లింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర కార్మిక శాఖ టెక్ దిగ్గజం ఇన్పోసిస్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వెంటనే ఇన్ఫోసిస్ ప్రతినిధులు కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖను సంప్రదించారు. కేంద్రం జారీ చేసిన నోటీసులకు సమాధానం ఇచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి తప్పులు జరగలేదని సమర్థించుకుంటున్నారు. అయితే ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల్లో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
నాసెంట్ ఐటీ ఎంప్లాయి సెనేట్ కేంద్రానికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కేంద్ర కార్మికమంత్రిత్వశాఖ ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్‌ఆర్ విభాగం హెడ్ క్రిష్ శంకర్‌కు నోటీసులు పంపింది.ఐటీ ఉద్యోగల సమస్యలపై ఉమ్మడి చర్చలకు రావాలని సూచించింది. చీఫ్ లేబర్ కమిషనర్ ముందు తమతో ఈ అంశంపై చర్చించాలని ఆదేశించింది. ఈమేరకు ఇన్ఫోసిస్ అధికారులతో పాటు, ఎన్‌ఐటీఈఎస్ ప్రతినిధులు చర్చల్లో పాల్గొని తమ వాదనలు వినిపిస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... ఇన్ఫోసిస్‌లో ఉద్యోగంలో భాగంగా తాము పనిచేసిన క్లయింట్లతో ఎలాంటి డీలింగ్స్ పెట్టుకోవద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులను ఆదేశించింది. ఈ మేరకు వారితో ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా పెట్టించుకుంది. ఇన్ఫోసిస్ వదిలిన తర్వాత మరో సంస్థలో చేరినప్పుడు పాత క్లయింట్స్ ద్వారా సేవలు అందించకూడదని షరతులు విధించింది. తన వ్యాపార నిర్వహణకు ఈ ఒప్పందం ఎంత అవసరమో కేంద్రానికి వివరిస్తోంది ఇన్ఫోసిస్. ఇది అనైతిక ఒప్పందం కాదని చెప్తోంది. ఇన్ఫోసిస్‌లో రాజీనామా చేసిన ఉద్యోగులు ఆరు నెలల పాటు యాక్సెంచర్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఐబీఎం, విప్రో వంటి కంపెనీల్లో పనిచేయకూడదని ఇన్ఫోసిస్ నిబంధన విధించింది. ఈ నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఈ నిబంధనతో తమ కెరీర్ దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒప్పందంలో ట్రూ స్పిరిట్ లేదని మండిపడుతున్నారు. ఈ నిబంధన కాంట్రాక్ట్ చట్టంలోని సెక్షన్ 27ను ఇన్ఫోసిస్ ఉల్లంఘించిందని కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ ఇన్ఫోసిస్ వివరణ కోరుతోంది.
alsor read
WiFi Tricks:వైఫై పాస్‌వర్డ్ మర్చిపోయారా?టెన్షన్ పడకండి..అయితే ఈ ట్రిక్ మీకు కోసమే
WhatsApp Cashback: వాట్సాప్ పేమెంట్స్‌తో భారీగా క్యాష్‌బ్యాక్.. పొందండి ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook