Internet Speed: ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఆన్‌లైన్ తరగతులైనా, బ్యాంక్‌ చెల్లింపులైనా ప్రస్తుతం అన్ని పనులు మొబైయిల్‌ ఫోన్లతోనే చేస్తున్నారు. దీనిని ఉపయోగించడానికి ఇంటర్నెట్ చాలా ముఖ్యం. ఏ పని చేయాలన్న అంతర్జాలం కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చాలా మంది స్మార్ట్‌ఫోన్ స్పీడ్ గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ వేగం తగ్గిపోవడం వల్ల తరచుగా మొబైయిల్‌లో సమస్యలు వస్తున్నాయి. సులభమైన చిట్కాలను అనుసరించి ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Cache Dataను క్లియర్‌ చేయండి:


సెల్‌ ఫోన్లలో Cache అనేది కీలక పాత్ర పోషిస్తుంది.   Cache నిండిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్ స్లో అవుతుంది. ఇది ఇంటర్నెట్ వేగాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ డాటాని క్లియర్ చేయండి. దీంతో మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.



ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఇలా చేయండి:


అంతేకాకుండా..ఫోన్ సెట్టింగ్‌లకు వెళ్లి.. నెట్‌వర్క్ సెట్టింగ్‌ను ఎంపిక చేస్తే.. నెట్‌వర్క్‌లో 4G లేదా LTE  ఉందో లేదో చూడండి. లేకపోతే అవ్వి రెండింటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకోండి.


రీస్టార్ట్ చేయండి:


చాలా మందికి ఇది తెలుసు ఫోన్‌ వేగం తగ్గిపోతే రీస్టార్ట్ చేస్తారు. ఫోన్ రీస్టార్ట్ అయినప్పుడు, మొబైల్ నెట్‌వర్క్‌ మెరుగుపడుతుంది. ఇది డేటా వేగాన్ని పెంచుతుంది.


ఆటో డౌన్‌లోడ్ ఫీచర్‌:


చాలా వినియోగదారులు అనుకోకుండా స్మార్ట్‌ఫోన్‌లో ఆటో డౌన్‌లోడ్ ఫీచర్‌ను ఎనేబుల్ చేస్తారు. దీని కారణంగా యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో అప్‌డేట్ అవుతూ ఉంటాయి. దీంతో డేటా కూడా త్వరగా అయిపోతుంది. ఇదేకాకుండా..ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదురురవుతాయి.


ఎయిరోప్లేన్ మోడ్‌:


ఫోన్లో ఇంటర్‌నెట్‌ వేగం తగ్గుతుంటే ఎయిరోప్లేన్ మోడ్‌ను ఆన్‌ చేసి ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల మొబైల్ నెట్ వర్క్ మెరుగుపడుతుంది.


వృధా యాప్‌లను తొలగించండి:


బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా పనికిరాని యాప్‌లు రన్ అవుతూనే ఉన్నాయి. అవి డేటాను వృధా చేస్తాయి. కావున మీరు వినియోగించని యాప్‌లను తొలగించడం మంచిది.


Also Read: How To Get Rid Of Dandruff: జుట్టు చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలను ఉపయోగించి విముక్తి పొందండి..!


Also Read: Almond Oil Benefits: చుండ్రుతో బాధపడే వారు ఈ రెండు ఇంటి చిట్కాలను పాటించండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook