Best Investment Plan for Long Term: మీరు కుటుంబ భవిష్యత్ కోసం ఏం ప్లాన్ చేశారు..? ఏం చేయలేదా..? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారా..? మేం చిన్నస్థాయి ఉద్యోగులం.. వచ్చే జీతం నెల ఖర్చులకే సరిపోవడం లేదు.. ఇంకా భవిష్యత్ ప్లానింగ్ కూడానా అంటారా.. అలా ఏమి అనుకోకండి. మీకు తక్కువ జీతం వచ్చినా.. ఎక్కువ జీతం వచ్చినా భవిష్యత్ అవసరాల కోసం మాత్రం కచ్చితంగా కొంత డబ్బు అయితే కూడబెట్టుకోవాలి. మీరు రోజుకు తక్కువ మొత్తంలో డిపాజిటి చేయడం ద్వారా కోటీశ్వరులు అవ్వచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు ప్రారంభంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. నెలకు 500 రూపాయలతో మిలియనీర్ కావాలనే మీ కల నెరవేరుతుంది. 500 నుంచి కోటి రూపాయల వరకు ఎలా చేరుకుంటామనే కదా మీ ఆలోచన..? మీరు మ్యూచువల్ ఫండ్లలో రోజుకు రూ.17 (నెలకు రూ.500) పెట్టుబడి పెడితే.. మ్యూచువల్ ఫండ్స్ 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడిని ఇస్తుండడంతో మీరు కోటీశ్వరులు అయ్యే ఛాన్స్ ఉంది.


మీరు ప్రతిరోజూ రూ.17 అంటే నెలకు రూ.500 చొప్పున డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని 20 ఏళ్లపాటు డిపాజిట్ చేస్తే మొత్తం రూ.1.2 లక్షలు అవుతుంది. ఈ 20 ఏళ్లలో ప్రతి సంవత్సరం 15 శాతం రాబడితో మీ ఫండ్ రూ.7 లక్షల 8 వేలకు పెరుగుతుంది. అదే 20 శాతం వార్షిక రాబడి వస్తే.. ఈ ఫండ్ రూ.15.80 లక్షలకు పెరుగుతుంది.


మీరు 30 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.500 పెట్టుబడి పెడితే.. మొత్తం రూ.1.8 లక్షలు డిపాజిట్ చేస్తారు. ఈ మొత్తం డబ్బుపై 30 సంవత్సరాలకు 20 శాతం వార్షిక రాబడిని పొందితే.. మీ ఫండ్ 1.16 కోట్ల రూపాయలకు పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా పెట్టుబడి పెట్టే వెసులుబాటు ఉంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి భారీ మొత్తంలో అర్జించే అవకాశం ఉంటుంది. మీకు ఆసక్తి ఉంటే నెలకు రూ.500 డిపాజిట్ చేసుకుంటూ.. భవిష్యత్‌పై భరోసాతో ఉండండి.


Also Read: MP Raghu Rama Krishnam Raju: ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి కౌంటర్.. గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమా వస్తాయి: ఎంపీ రఘురామ   


Also Read: Nagababu Birthday: మా చిన్నన్నయ్య ధృడంగా నిలబడే వ్యక్తి.. ఆయనకు ప్రత్యేక స్థానం: పవన కళ్యాణ్‌  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook