Oppo Find N2 Flip To iQOO Z7 Mobiles: ఈ ఏడాది ఇప్పటికే అనేక ఫేమస్ బ్రాండ్స్ నుంచి స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అవడం చూశాం. శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్, వన్‌ప్లస్ 11 5G.. ఇలా చెప్పుకుంటూ పోతే వాలెంటైన్స్ డే ను టార్గెట్ చేస్తూ ఫిబ్రవరి నెలలోనే ఎన్నో ఫోన్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. అంతటితో స్మార్ట్ ఫోన్స్ మేకర్స్ దూకుడుకు బ్రేక్ పడటం లేదు. ఇప్పటికే ఒప్పో ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ మొబైల్ లాంచ్ అయ్యే తేదీని ప్రకటించగా, తాజాగా ఐకూ కూడా మార్చి 21న తమ కొత్త ఫోన్ iQOO Z7 ని లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టంచేసింది. ఇలా ఈ మార్చి నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫోన్ల జాబితాపై ఓ స్మాల్ లుక్కేద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐకూ Z7:
ఐకూ కంపెనీ ఐకూ Z6 ఫోన్ కి కొనసాగింపుగా ఐకూ Z7 5G  ఫోన్ లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలే ఐకూ ఫోన్ ఈ డివైజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ షేర్ చేసింది. ప్రస్తుతానికి ఐకూ Z7 ఫోన్ కి సంబంధించిన ఫీచర్స్ జాబితా ఏంటనేది అందుబాటులో లేనప్పటికీ.. స్మార్ట్‌ఫోన్ మార్చి 21న లాంచ్ అవడం ఖాయమని తేలిపోయింది.


ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్:
ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్.. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్స్‌లో ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ కూడా ఒకటి. ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ లాంచింగ్ తో ఒప్పో కంపెనీ కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కేటగిరీలోకి ఎంట్రీ ఇస్తోంది. మార్చి 13న ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ లాంచ్ కానున్నట్టు కంపెనీ స్పష్టంచేసింది. లాంచింగ్ రోజే ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ ధర ఎంత అనే వివరాలను వెల్లడించనున్నట్టు కంపెనీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.


మోటో X40 మార్చి 20, 2023న లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం రూ. 40,000 లోపు ఈ ఫోన్ ధర ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 165Hz రిఫ్రెష్ రేట్‌ని సపోర్ట్ చేసే 6.67 అంగుళాల స్క్రీన్‌ అమర్చారు.


ఒప్పో ఫైండ్ X6
ఒప్పో ఫైండ్ X6 మొబైల్ లాంచింగ్‌కి సంబంధించి ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒప్పో ఫైండ్ X6 సిరీస్‌ మొబైల్ లాంచింగ్ మార్చి 2023 ఆఖరి వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


వన్‌ప్లస్ నార్జ్ 3
వన్‌ప్లస్ ఈమధ్యే చైనాలో ఏస్ 2V అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇదే ఫోన్ ని వన్‌ప్లస్ నార్జ్ 3 పేరిట ఇండియాలో లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ వంటి ఫీచర్స్‌తో ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది.


ఇది కూడా చదవండి : Stocks to Buy: 60 శాతం లాభాలు తెచ్చిపెట్టే షేర్స్ ఇదిగో


ఇది కూడా చదవండి : Ola Electric Scooters: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై రూ. 16 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్స్


ఇది కూడా చదవండి : Maruti to Mahindra: ఏ బ్రాండ్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయంటే..


ఇది కూడా చదవండి : E-Aadhaar Card Download: ఆధార్ నెంబర్ లేకున్నా.. ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోండిలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo