UPI Payments Charges: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులే కన్పిస్తున్నాయి. త్వరలో ఆన్‌లైన్ చెల్లింపులు కూడా ప్రియంగా మారనున్నాయి. ఆర్బీఐ వీటిపై ఛార్జ్ వసూలు చేసేందుకు యోచిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో డిజిటల్ చెల్లింపులు ప్రాముఖ్యత పెరిగింది. ఆన్‌లైన్ లావాదేవీలు, ఆన్‌లైన్ చెల్లింపులు కూడా అధికమయ్యాయి. అత్యంత సులభంగా చెల్లింపులకు ఆస్కారముండటంతో అందరూ యూపీఐ ఆన్‌లైన్ పేమెంట్ విధానాన్ని ఆశ్రయిస్తున్నారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే ఇలా చాలా మాధ్యమాల ద్వారా నగదు బదిలీ చేస్తున్నారు. ఇదంతా ఉచితం కావడంతో వీటికి ప్రాముఖ్యత పెరిగింది. ఇకపై యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులు ప్రియం కానున్నాయని తెలుస్తోంది. కారణం వీటిపై ఆర్బీఐ కన్నేయడమే. యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై ఛార్జ్ వసూలు చేసే యోచనలో ఆర్బీఐ ఉందని తెలుస్తోంది. దీనిపై అప్పుడే అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. సామాన్య మానవుడి జేబు గుల్ల కావచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది.


యూపీఐ ఆన్‌లైన్ చెల్లింపులపై ఆర్బీఐ ఛార్జ్ వసూలు చేయనుందని వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ స్పందించింది. యూపీఐ ద్వారా జరిపే చెల్లింపులపై ఏ విధమైన ఛార్జ్ వసూలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపింది. యూపీఐ విధానంలో చెల్లింపులు ప్రతి ఒక్కరికీ సులభంగా ఉన్నందున అందరూ దీనిని ఆశ్రయిస్తున్నారని..ఫలితంగా డిజిటల్ పేమెంట్స్ పెరిగి దేశపు ఆర్ధిక వ్యవస్థకు లాభం కలుగుతుందని ఆర్ధిక శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పన్ను వసూలు చేసే ఆలోచన చేయడం లేదని వెల్లడించింది.


ఆర్బీఐ సమీక్ష కాగితాల్లో ప్రస్తావన


వాస్తవానికి పేమెంట్ సిస్టమ్ ఛార్జెస్‌పై ఒక సమీక్ష కాగితం బయటికొచ్చింది. ఈ సమీక్ష జరిపింది ఆర్బీఐ అని తెలుస్తోంది. ఆన్‌లైన్ చెల్లింపులపై ప్రత్యేక ఛార్ద్ వసూలు చేస్తే ఎలా ఉంటుందనే విషయం చర్చకు వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ప్రతి ఆన్‌లైన్ పేమెంట్‌పై ఒకే విధమైన ఛార్జ్ వసూలు చేయాలా లేదా నగదు బదిలీ మొత్తాన్ని బట్టి ఛార్జ్ వేయాలా అనేది చర్చించినట్టుగా తెలిసింది. డెబిట్ కార్డు చెల్లింపుల విషయంలో కూడా ఇదే రకమైన చర్చ వచ్చింది. అందుకే సర్వత్రా ఈ విషయంపై ఆందోళన రేగింది. అయితే కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారాన్ని ఖండించడంతో సమస్యకు తెరపడినట్టైంది. 


Also read: LIC Offer: ప్రీమియం చెల్లించక ఆగిపోయిన పాత పాలసీలు తెర్చుకునే అవకాశం, భారీ డిస్కౌంట్ కూడా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook