IT returns: ట్యాక్స్​ పేయర్స్​కు కీలక ప్రకటన ప్రకటన చేసింది కేంద్రం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇన్​కం ట్యాక్స్ రిటర్ను (ఐటీఆర్​) దాఖలు చేసేందుకు గడువు పెంపు ఉండదని స్పష్టం చేసింది. గడువు పెంపునకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్​ బజాజ్ వెల్లడించారు. 2021-22 మదింపు సంవత్సరానికి సంబంధించి ఐటీఆర్​ దాఖలు గడువు నేటితో ముగియనున్నట్లు స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఐటీఆర్ దాఖలుకు గడువు జులై 31తో ముగియాల్సి ఉంది. కరోనా భయాలు, ఐటీఆర్​ వెబ్​సైట్లలో లోపాల కారణంగా గడువు పెంచుతూ వచ్చింది కేంద్రం. అలా డిసెంబర్ 31 ని తుది గడువుగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రక్రియ సాఫిగా సాగుతున్న నేపథ్యంలో గడువు పెంపు యోచన లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


పెరిగిన ఐటీఆర్ ఫైలింగ్స్​..


ఈ ఏడాది ఇప్పటి వరకు (డిసెంబర్ 31 మధ్యాహ్నం 3 గంటల వరకు)5.62 కోట్ల మంది ఐటీఆర్ దాఖలు చేసినట్లు తరుణ్​ బజాజ్ వెల్లడించారు. గతంతో పోలిస్తే 60 లక్షల రిటర్నులు అధికంగా దాఖలైనట్లు వివరించారు. ఇక చివరి రోజు 20 లక్షలకు పైగా ట్యాక్స్ పేయర్స్​ ఐటీఆర్​ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.


రేపటి నుంచి ఐటీఆర్ దాఖలుకు చేసేందుకు రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ఇది వరకే స్పష్టం చేసింది.


Also read: Petrol Pump Frauds: దేశంలోని అనేక పెట్రోల్ స్టేషన్లలో చీటింగ్.. ఆ మోసాలను పసిగట్టండిలా!


Also read: Stock Market today: 2021కి భారీ లాభాలతో గుడ్​బై చెప్పిన స్టాక్ మార్కెట్లు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook