ITR Filing: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు విషయంలో చాలామంది గడువు తేదీ పొడిగించవచ్చని భావిస్తున్నారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు జూలై 31 చివరి తేదీ. ట్యాక్స్ పేయర్లతో ట్యాక్స్ ప్రాక్టీషనర్లు బిజీగా ఉంటున్నారు. అందరూ చివరి నిమిషంలో పరుగులెత్తుతుండటంతో రష్ ఎక్కువౌతోంది. ఈ క్రమంలో గడువు తేదీ పొడిగించవచ్చని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి స్పష్టత వచ్చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2022-23 ఆర్దిక సంవత్సరం, 2023-24 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు మరో 15 రోజులే సమయముంది. జూలై 31లోగా ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ విధిగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ మీరు మీ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకపోతే వెంటనే చేసేయండి. లేకపోతే పలు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా గడువు తేదీ పొడిగించే విషయంలో ఏ విధమైన హామీ ఇవ్వలేదు. గడువు తేదీ పొడిగించే ఆలోచన లేదని కూడా కేంద్ర ఆర్దిక శాఖ స్పష్టం చేసింది. గత ఏడాది కూడా ట్యాక్స్ రిటర్న్స్ గడువు పెంచలేదు. 


ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ పొడిగించే అవకాశాలు లేనందున తక్షణం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయమని సూచిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు పెంచవచ్చనే వాదన విన్పించినా ఐటీ అధికారులు నిరాకరించారు. అటువంటి ఆలోచన ఏదీ లేదని చెప్పారు. చివరి నిమిషంలో ఎదురయ్యే రద్దీని నివారించేందుకు తక్షణం ఇప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిందిగా సూచించారు. గత ఏడాది జూలై 12 వరకూ ఇదే సమయంలో 10 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారు. 


జూలై 13 వరకూ అసెస్‌మెంట్ ఇయర్ 2023-24 కు దాఖలైన ఐటీ రిటర్న్స్ 23.4 మిలియన్ల వరకూ ఉంది. ఇందులో 21.7 మిలియన్ల రిటర్న్స్ వెరిఫై చేయాలి. ఇది కాకుండా అసెస్‌మెంట్ ఇయర్ 2023-24కు మొత్తం 8.48 మిలియన్ల ఐటీ వెరిఫికేషన్ పూర్తయింది. ఐటీ రిటర్న్స్ ఆలస్యంగా ఫైల్ చేస్తే 5000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. 


Also read: Hyundai Exter: ఆ ఐదు ప్రత్యేకతలే టాటా పంచ్ కంటే హ్యుండయ్ ఎక్స్‌టర్‌ను ముందు నిలబెట్టింది, ధర ఎంతంటే



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook