ITR Filing Last Date: ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగించండి
ITR Filing Last Date: ఐటి రిటర్న్స్ గడువు ముగియవచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది టాక్స్ పేయర్స్ తమ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు యత్నిస్తున్నప్పటికీ.. దేశం నలుమూలలా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, వరదలు సంభవించిన కారణంగా గడువు దాటిపోయే ప్రమాదం ఉంది.
ITR Filing Last Date: ఐటి రిటర్న్స్ గడువు ముగియవచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది టాక్స్ పేయర్స్ తమ ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు యత్నిస్తున్నప్పటికీ.. దేశం నలుమూలలా అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం, వరదలు సంభవించిన కారణంగా గడువు దాటిపోయే ప్రమాదం ఉంది. అందుకే పన్ను చెల్లింపుదారులు ఒకవేళ ఐటిఆర్ ఫైల్ చేయకపోతే ఎదురయ్యే పరిణామాల గురించి, చెల్లించాల్సిన జరిమానాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.
జరిమానా లేకుండా ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఉన్న గడువు జూలై 31వ తేదీతో ముగియనుంది. ఒకవేళ మీకు ఐటి రిటర్న్‌ను ఫైల్ చేయడంలో ఏదైనా సమస్యలు తలెత్తితే, సహాయం కోసం మీరు ఐటి విభాగం హెల్ప్‌డెస్క్‌ని కాంటాక్ట్ అవవచ్చు అని ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ.. చాలా మంది పన్ను చెల్లింపుదారులు వివిధ సాంకేతిక కారణాలతో ఐటి రిటర్న్స్ దాఖలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలోనే చాలామంది టాక్స్ పేయర్స్ ఐటి రిటర్న్స్ ఫైలింగ్ తుది గడువును పొడిగించాల్సిందిగా కోరుతూ ఐటి విభాగాన్ని రిక్వెస్ట్ చేయసాగారు.
ఐటి రిటర్న్స్ దాఖలు చేయడంలో విఫలం అవుతుండటంపై ట్విటర్ ద్వారా తమ ఆందోళన వ్యక్తంచేసిన టాక్స్ పేయర్స్.. తమకు జరిమానా లేకుండా ఐటి రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు పొడిగించాల్సిందిగా డిమాండ్ చేశారు.
ఇంకొంత మంది ఐటి రిటర్న్స్ ఆలస్యంగా ఫైల్ చేసే వారికి శాశ్వతంగా లేట్ ఫీజు రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేయడం కనిపించింది.
ఇది కూడా చదవండి : ITR Filing Last Date: ఐటి పోర్టల్ సర్వర్ కనెక్ట్ అవకపోతే ఏం చేయాలి.. సకాలంలో ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది ?
ఇంకొంతమంది ఐటి పోర్టల్‌లో తమకు ఎదురైన సాంకేతిక సమస్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ని ట్విటర్‌లో పోస్ట్ చేసి.. పరిస్థితి ఇలా ఉంటే తాము మాత్రం ఏం చేయగలమో మీరే చెప్పండి అంటూ ఐటి శాఖను నిలదీశారు. ఇలా ఒక్కొక్కరి నిరసన ఒక్కో రకంగా కనిపించింది. మొత్తానికి నేడు జులై 31తో ఐటీఆర్ ఫైలింగ్ ముగియనున్న నేపథ్యంలో ఇవాళ ఇంటర్నెట్లో ఐటి రిటర్న్స్ ఫైలింగ్ అనేది ఒక హాట్ టాపిక్ అయి కూర్చుంది. సందట్లో సడేమియా అన్నట్టు మధ్యలో మీమ్స్ మేకర్స్ ఇంట్రెస్టింగ్ మీమ్స్ చేసుకుంటూ, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ పని కానిచ్చుకున్నారు. నెటిజెన్స్ వాటిని షేర్ చేసుకుంటూ పండగ చేసుకున్నారు.
ఇది కూడా చదవండి : Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి