ITR Filing Last Date: ఐటి పోర్టల్ సర్వర్ కనెక్ట్ అవకపోతే ఏం చేయాలి.. సకాలంలో ఫైలింగ్ చేయకపోతే ఏమవుతుంది ?
ITR 2023 Filing Last Date: న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు రేపు జులై 31వ తేదీతో ముగియనుంది. గడువు తేదీకి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంటంతో లక్షలాది మంది టాక్స్ పేయర్స్ ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు.
ITR 2023 Filing Last Date: న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు రేపు జులై 31వ తేదీతో ముగియనుంది. గడువు తేదీకి ఇంకా ఒక్క రోజే మిగిలి ఉంటంతో లక్షలాది మంది టాక్స్ పేయర్స్ ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒకేసారి ఐటి రిటర్న్స్ ఫైల్ చేసే వారు భారీ సంఖ్యలో ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ అవడంతో కొంతమంది కస్టమర్లకు పోర్టల్ సర్వర్ డౌన్ అయింది.
ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియర్ ప్రాసెస్ అంతా క్లియర్ అవ్వాల్సిన ఐటి రిటర్న్స్ ఫైలింగ్ ప్రాసెస్.. లాస్ట్ హవర్ రష్ ఎక్కువ అవడంతో చాలా మందికి ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లోకి లాగిన్ అసాధ్యంగా మారింది. దీంతో చాలా మంది ముఖాల్లో ఆ టెన్షన్ స్పష్టంగా కనిపించింది. చాలామంది ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్ సర్వర్ ఇష్యూస్ గురించి #IncomeTaxPortalIssues పేరుతో ఇన్‌కమ్ టాక్స్ విభాగానికి ఫిర్యాదు చేయడం కనిపించింది.
సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి వస్తోన్న ఫిర్యాదులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పందించారు. తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఐటి విభాగం స్పందిస్తూ.. ఐటి పోర్టల్ తో సమస్య ఎదుర్కొంటున్న వారికి పరిష్కారం సూచించింది. "దయచేసి బ్రౌజర్ క్యాచెని క్లియర్ చేసిన తర్వాత మరోసారి ప్రయత్నించండి అని సూచించిన ఐటి విభాగం... మీకు ఇంకా ఏదైనా సమస్యలు తలెత్తితే, దయచేసి మీ వివరాలను షేర్ చేస్తే.. ఐటి బృందం మిమ్మల్ని సంప్రదిస్తుంది అని వెల్లడించింది.
ఇది కూడా చదవండి : Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?
ఐటి రిటర్న్స్ తుది గడువు పొడిగిస్తారా ?
ఐటి రిటర్న్స్ ఫైలింగ్ చేయడానికి జూలై 31, 2023 గడువు తుది తేదీ కాగా.. ఈ తేదీని పొడిగిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి భారత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయనందున.. గడువు పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా మీ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం ఉత్తమం. ఎందుకంటే.. ఒకవేళ ప్రభుత్వం ఈ గడువును పొడిగించకపోతే.. ఐటీఆర్ ఫైల్ చేయని వారు సకాలంలో ఫైలింగ్ చేయనందుకుగాను రూ. 5000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐటి విభాగం ఇచ్చే కొన్ని రాయితీలను కూడా నష్టపోతారు.
ఇది కూడా చదవండి : Honda Elevate Car Review: హోండా ఎలివేట్ కారు రివ్యూ.. ధర, ఫీచర్స్. మైలేజ్ వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి