New plans: దేశంలోని టెలికాం దిగ్గజాలన్నీ కనీసం 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీ పెయిడ్​ ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చాయి. ఇప్పటి వరకు మంథ్లీ ప్లాన్ అంటే 28 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్​.. గతంలో టెలికాం సంస్థలన్నీ నెల మొత్తం కవర్ అయ్యేలా కనీసం ఒక ప్రీ పెయిడ్​ ప్లాన్ అందుబాటులో ఉండాలని సూచించిన నేపథ్యంలో.. దిగ్గజ టెలికాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలు తమ.. కొత్త ప్లాన్స్​ను అందుబాటులోకి తెచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో నెల రోజుల ప్లాన్..


అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన కొత్త ప్లాన్​ను ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. రూ.296తో ఈ ప్లాన్​ను కొనుగోలు చేస్తే.. రోజుకు అన్​ లిమిటెడ్ కాల్స్​, 100 ఎస్​ఎంఎస్​లు సహా 25 జీబీ 4జీ డేటా లభిస్తుంది.


ఎయిర్​టెల్ ఆఫర్ ఇలా..


ఎయిర్​టెల్ కూడా రిలయన్స్ మాదిరిగానే రూ.296తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల వ్యాలిడిటీతో అందించే ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్​ ద్వారా 25 జీబీ 4జీ డేటా, అన్​ లిమిటెడ్ కాల్స్​, 100 ఎస్​ఎంఎస్​లు (రోజుకు) పొందొచ్చు.


ఇక రూ.319తో కూడిన మరో ప్లాన్​ను కూడా అందుబాటులో ఉంచింది ఎయిర్​టెల్​. దీని ద్వారా ప్రతి రోజూ 2 జీబీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లు, అన్​లిమిటెడ్ కాల్స్​ను 30 రోజుల పాటు వినియోగించుకోవచ్చు.


వొడాఫోన్ ఐడియా 31 రోజుల ప్లాన్​..


వొడాఫోన్ ఐడియా కాస్త భారీ ధరతో 30 రోజుల ప్లాన్​ను అందుబాటులోకి తెచ్చింది. రూ.327తో రీఛార్జ్ చేసుకుంటే.. అపరిమిత వాయిస్​ కాల్స్​, రోజుకు 100 ఎస్​ఎంఎస్​లతోపాటు.. 25 జీబీ డేటాను ఇస్తోంది.


దీనితో పాటు రూ.337తో 31 రోజుల వ్యాలిడిటీ ఇస్తూ మరో ప్లాన్​ను అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. దీని ద్వారా రోజుకు 2జీబీ 4జీ డేటా, 100 ఎస్​ఎంఎస్​లతో పాటు.. అపరిమిత కాల్స్​ను ఆస్వాదించొచ్చని కంపెనీ చెబుతోంది.


Also read: LIC IPO Update: మే మొదటి వారంలోనే ఎల్​ఐసీ ఐపీఓ.. పూర్తి అప్​డేట్స్ ఇవే


Also read: Petrol price: సామాన్యులపై పెట్రో పిడుగు.. 2014తో పోలిస్తే ధరలు ఎంత పెరిగాయో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook