JIO Family Postpaid Plans: దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీ పెయిడ్ సెగ్మెంట్‌లో జియో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఇప్పుడు పోస్ట్ పెయిడ్ విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త పోస్ట్ పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్స్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో కుటుంబంలోని నలుగురు నెల రోజులు సేవలు పొందొచ్చు. కొత్త పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను రూ.399తో ప్రారంభించింది. ఇందులో ఒక్కో ప్రత్యేక కనెక్షన్‌కు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. అంటే కుటుంబంలోని నలుగురు సభ్యులకు ప్రతినెలా రూ.699 టారిఫ్ చెల్లించాల్సి ఉంటుంది. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    జియో కొత్త పోస్ట్‌పెయిడ్ టారిఫ్ ప్లాన్ ఇతర పోటీదారుల కంటే 30 శాతం తక్కువగా ఉంది. సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.399 ప్లాన్‌కు రూ.500, రూ.699 ప్లాన్‌కు రూ.875 చెల్లించాలని జియో తెలిపింది. క్రెడిట్ కార్డు, జియో ఫైబర్, నాన్ జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు డిపాజిట్ మినహాయింపు ఉంది.     రూ.699 ప్లాన్‌ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా పొందొచ్చు.

  • జియో లేటెస్ట్ ఆఫర్‌తో ఇతర టెలికాం ఆపరేటర్‌లపై ఇలాంటి ప్లాన్‌లను ప్రారంభించాలని ఒత్తిడి పెరగవచ్చు. లేకపోతే వారి కస్టమర్లు జియో పోస్ట్ పెయిడ్ ఆఫర్‌కు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ పెయిడ్ మొబైల్ సెగ్మెంట్లో రిలయన్స్ జియో అతిపెద్ద ప్లేయర్. ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి కంపెనీ భారీ ఆదాయాన్ని అర్జిస్తోంది. కానీ పోస్ట్ పెయిడ్ మొబైల్ కేటగిరీలో జియో తన ప్రత్యర్థి కంపెనీల కంటే చాలా వెనుకబడి ఉంది. 

  • రిలయన్స్ జియో ఈ కొత్త పోస్ట్ పెయిడ్ టారిఫ్ ప్లాన్ కారణంగా.. ప్రస్తుతానికి మొబైల్ టారిఫ్‌ను పెంచే అవకాశాలకు బ్రేక్ పడవచ్చు. ఇటీవల భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ మొబైల్ టారిఫ్‌ను పెంచాలని సూచించారు. ఈ ఏడాది మధ్యలో మొబైల్ టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అన్ని కంపెనీలు 5G టెలికాం సేవలో చాలా పెట్టుబడి పెట్టాయి. ఇక క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై రాబడి కోసం కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచేందుకు రెడీ అవుతుతున్నాయి. కానీ  జియో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌తో పోటీ పెరుగింది. దీంతో టారిఫ్ పెంపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

  • జియో చౌకైన పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లను ప్రారంభించిన ప్రభావం బుధవారం ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లపై కూడా కనిపించింది. రెండు టెలికాం కంపెనీల షేర్లలో తగ్గుదల కనిపించింది. ఎయిర్‌టెల్ షేర్లు 1.96 శాతం నష్టంతో రూ.756.55 వద్ద ముగియగా.. వొడాఫోన్ ఐడియా షేర్లు 2.29 శాతం క్షీణించి రూ.6.40 వద్ద ముగిశాయి. 


Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి


Also Read: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. పంత్ లేటెస్ట్ వీడియో చూశారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి