Disney+ Hotstar Free Subscription with JIO Recharge: సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది జియో. తాజాగా వరల్డ్ కప్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. డిస్నీ+హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. తమ వినియోగదారులకు ఇప్పుడు డిస్నీ+హాట్‌స్టార్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లతో జియో కస్టమర్లు లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, సినిమాలు, టీవీ షోలు, ఇతర వినోద కార్యక్రమాలను చూడొచ్చు. ఆ ప్లాన్‌ల వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జియో రూ.328 ప్లాన్ వివరాలు ఇలా..


జియో కొత్త ప్లాన్‌లలో తక్కువ ధరలో ఉన్న ప్లాన్ రూ.328. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. వినియోగదారులు 3 నెలల డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో లభిస్తుంది. 28 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ క్రికెట్ ప్రేమికులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వరల్డ్ కప్ నేపథ్యంలో డైలీ ఫ్రీగా డేటాకు ఇబ్బంది లేకుండా మ్యాచ్‌లను వీక్షించవచ్చు. 


జియో రూ.758 ప్లాన్ వివరాలు ఇలా..


జియో తీసుకువచ్చిన మరో ప్లాన్‌ రూ.758. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ హై-స్పీడ్ డేటాను లభిస్తుంది. అదేవిధంగా 3 నెలల డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. 


జియో రూ.388 ప్లాన్ వివరాలు ఇలా..


రూ.388 ప్లాన్‌ను 28 రోజుల చెల్లుబాటుతో తీసుకువచ్చింది జియో. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 2 జీబీ డేటా, 3 నెలల పాటు డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. రూ.808 రూపాయల ప్లాన్ కూడా ఉంది. ఇందులో డైలీ 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులకు ఉంటుంది. వీటితో పాటు జియో రెండు ప్రీమియం ప్లాన్‌లు కూడా ఉన్నాయి. 84 రోజుల ప్లాన్ రూ.598, వార్షిక ప్లాన్ రూ.3178. మీరు రూ.598 ప్లాన్‌ను ఎంచుకుంటే.. 84 రోజుల పాటు రోజుకు 2 జీబీ హై-స్పీడ్ డేటాతో ఒక సంవత్సరం డిస్నీ+హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. రూ.3178 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది పొడవునా డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.


Also Read: RBI Monetary Policy: వడ్డీరేట్లపై ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. స్థిరంగా రెపో రేటు   


Also Read: Shikhar Dhawan Divorce Reason: మాజీ భార్య కారణంగా భారీగా నష్టపోయిన శిఖర్ ధావన్.. వామ్మో ఏకంగా అన్ని కోట్లా..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి