Jio Down: టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియో సేవలకు శనివారం అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ముంబయి సర్కిల్​లోని యూజర్లు నెట్​వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఔట్​ గోయింగ్ కాల్స్​, ఇన్​కమింగ్ కాల్స్​ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చాలా మంది వెల్లడించారు. ఇక ఇంటర్నెట్​ సేవలు సైతం వినియోగించుకోలేకపోతున్నట్లు తెలిపారు.


ట్విట్టర్​లో యూజర్ల ఫైర్​..


నెట్​వర్క్ డౌన్​ అవడంపై కొంత మంది ట్విట్టర్ వేదికగా జియోలో తలెత్తిన సమస్యలను రిపోర్ట్ చేశారు.


తమ జియో నెంబర్లు పని చేయడం లేదని చెప్పారు. అంతే కాకుడా ఇతర నెట్​వర్క్​లతో జియో నంబర్లకు కాల్​ చేసినా కాల్స్​ కనెక్ట్ కావడం లేదని చెప్పుకొచ్చారు. జియో నెట్​వర్క్ ఇలా చేయడంపై కొంత మంది యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



మరికొంత మందేమో.. చాలా రోజుల నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామి.. ఇక ఎయిర్​టెల్​ లేదా ఇతర నెట్​వర్క్​లకు ఛేంజ్ కావాల్సిన సమయం వచ్చిందంటూ తమ జియో నెట్​వర్క్​పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


కొంత మంది యూజర్లు.. పనులన్నీ ఆగిపోయాయని వెంటనే సమస్యను పరిష్కరించాలని జియోకు ట్వీట్​ చేస్తున్నారు.



జియోపై జోకులు..


ఇక జియో నెట్​వర్క్ డౌన్​పై చాలా మంది #Jiodown ట్వీట్​లు చేస్తున్నారు. మరికొంత మంది జియోపై జోకులు వేస్తూ.. ఎయిర్​టెల్​, వొడాఫోన్ ఐడియాలను పొగుడుతున్నారు.



అధికారికంగా వెల్లడించని జియో..


అయితే ముంబయిలో నెట్​వర్క్ అంతరాయంపై జియో అధికారిక ప్రకటన చేయలేదు. దీనితో పాటు ఇంకా వేరే సర్కిళ్లలోనూ ఇలాంటి సమస్యలు ఏవైనా వచ్చాయా? అనే విషయంపైనా జియో స్పష్టతనివ్వాల్సి ఉంది.


Also read: iPhone SE 3: యాపిల్ నుంచి బడ్జెట్ 5జీ ఫోన్- ధర, ఫీచర్ల వివరాలివే..!


Also read: PF Accounts: రెండు భాగాలుగా పీఎఫ్ అకౌంట్స్.. ఈ ఏడాది ఏప్రిల్​ నుంచే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook