Kia Cars Price Increase in 2023: కొత్త సంవత్సరం 2023 వచ్చిందని సంతోషిస్తున్న ప్రజలకు అన్ని వస్తువుల ధరలు షాక్ ఇస్తున్నాయి. జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరగడం మొదలైంది. ప్రముఖ కార్ల తయారీదారు 'కియా మోటార్స్' తన కస్టమర్లకు షాక్ ఇస్తూ.. అన్ని కార్ల ధరలను రూ.లక్ష వరకు పెంచింది. కొత్త ధరలు 2023  జనవరి 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఏప్రిల్‌లో వచ్చే కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం.. పెరుగుతున్న వస్తువుల ధరలను, కార్లను అప్‌గ్రేడ్ చేయడానికి అయ్యే ఖర్చును భర్తీ చేయడానికి ధరల పెంపు జరిగిందని కియా మోటార్స్ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో కియా మోటార్స్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఐదు రకాల వాహనాలు ఉన్నాయి. కియా సోనెట్, కియా సెల్టోస్, కియా కేరెన్స్, కియా కార్నివాల్, కియా ఈవీ6 వంటి 5 వాహనాలు పోర్ట్‌ఫోలియో జాబితాలో ఉన్నాయి. కార్నివాల్ మినహా మిగతా కార్ల ధరలను కంపెనీ పెంచింది. పెంచిన వాటిలో ఈవీ6 ధర అత్యధికంగా పెరిగింది. కియా ఇండియా వాహనాల పెరిగిన పూర్తి ధరల జాబితాను ఇప్పుడు చూద్దాం. 


Kia EV6:
కియా ఈవీ6 రెండు వేరియంట్‌ల ధరను కంపెనీ రూ. 1 లక్ష పెంచింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 60.95 లక్షల నుంచి రూ. 65.95 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. అయితే కార్నివాల్ ధరలు మునుపటిలాగే ఉన్నాయి. కార్నివాల్ MPV ధర ఇప్పటికీ రూ. 30.99 లక్షల నుంచి రూ. 35.49 లక్షల మధ్య ఉంది.


Kia Seltos:
కియా సెల్టోస్ 1.4L టర్బో పెట్రోల్ వేరియంట్ మునుపటితో పోలిస్తే.. రూ. 40,000 పెరిగింది. 1.5L NA పెట్రోల్ వేరియంట్‌పై రూ. 20,000 పెరిగింది. అదే సమయంలో SUV 1.5L డీజిల్ వేరియంట్ ధర రూ. 50,000 పెరిగింది. ఏ కారు కొత్త ధర రూ. 10.69 లక్షల నుంచి రూ. 19.15 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది.


Kia Carens: 
కియా కేరెన్స్ MPV 1.5L పెట్రోల్ వేరియంట్ ధర 20,000 రూపాయలు పెరిగింది. 1.4L టర్బో పెట్రోల్ వేరియంట్‌పై రూ. 25,000 పెరిగింది. డీజిల్ వేరియంట్ ధర రూ.45,000 పెరిగింది. కేరెన్స్ కొత్త ధర రూ. 10.20 లక్షల నుంచి రూ. 18.45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది.


Kia Sonet:
భారతదేశంలో కియా కంపెనీ అత్యంత చౌకైన కారు సొనెట్. ఈ కారు 1.0L టర్బో పెట్రోల్ వేరియంట్ ధర రూ. 25,000 పెరిగింది. డీజిల్ వేరియంట్‌పై రూ. 40,000 పెరిగింది. ఇక 1.2L పెట్రోల్ వెర్షన్‌పై రూ. 20,000 పెరిగింది.


Also Read: Rahu Transit 2023: 2023లో రాహువు సంచారం.. ఈ 4 రాశుల వారి పని ఔట్! అడుగడుగునా కష్టాలే


Also Read: Hyundai Car Sales 2022: 2022లో అత్యధిక అమ్మకాలతో దుమ్మురేపిందిగా.. ఈ ఎస్​యూవీ కార్ ముందు అన్ని బేజారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.