Kia Seltos Facelift: భారత కార్ మార్కెట్‌లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండయ్ తరువాత ఇటీవలి కాలంలో కియో మోటార్స్ క్రేజ్ పెరుగుతోంది. ఎస్‌యూవీ విభాగంలో ప్రాచుర్యం పొందిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చింది. ధర ఎంతనేది ఇంకా నిర్ధారించకపోయినా జూలై 14 నుంచి కంపెనీ బుకింగ్స్ ప్రారంభిస్తోంది. కియా సెల్టోస్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. దాంతోపాటు కొత్త ఫీచర్లు చేరాయి. ADAS లెవెల్ 2 అప్‌గ్రేడ్ అత్యంత కీలకమైంది. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లుక్, ఫీచర్ల గురించి పరిశీలిద్దాం.


కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రీడిజైన్ చేసిన స్వీపింగ్ ఎల్ఈడీ, ఎల్ఈడీ ఢీఆర్ఎల్ ఉన్నాయి. కొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్ ఇందులో ప్రత్యేకతలు. కియా సెల్టోస్ న్యూ వెర్షన్‌లో రీడిజైన్ చేసిన బంపర్, కొత్త స్కిడ్ ప్లేట్, స్పోర్టీ లుక్స్, టైగర్ నోజ్ గ్రిల్ చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో రీడిజైన్ చేసిన టెల్ గేట్, న్యూ స్టార్ మ్యాప్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో 17 ఇంచెస్ ఎల్లోయ్ వీల్స్, సెగ్మెంట్‌లో 18 ఇంచెస్ క్రిస్టల్ కట్ గ్లాసీ బ్లాక్ ఎల్లోయ్ వీల్ ఉంది. 


డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్‌రూఫ్ మరో ప్రత్యేకత. ఇందులోని కొత్త డ్యూయల్ జోన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్ మీ జర్నీని మరింత సుఖవంతం చేస్తుంది. ఈ కారులో 8 ఇంచెస్ హెడ్ అప్ డిస్‌ప్లే,స 8 వే పవర్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు, 8 స్పీకర్ల బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫయర్, 360 డిగ్రీ కెమేరా ఉన్నాయి. ఈ కారులో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్, సరికొత్త 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఉన్నాయి. టర్బో పెట్రోల్ వెర్షన్ 160 పీఎస్ పవర్, 253 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఇందులో టాన్స్‌మిషన్ ఆప్షన్లు 5 ఉన్నాయి.


కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో 32 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అత్యాధునిక లెవెల్ ADAS ఉంది. సెల్టోల్‌లో ఉన్న ADAS సిస్టమ్ 17 ఆధునిక ఫీచర్లతో ఉంది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్ బ్యాగ్స్, 3 ఫ్రంట్ సీట్ బెల్ట్ ఉన్నాయి. దీంతోపాుట యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్, బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.


Also read: Maruti Fronx vs Tata Punch: టాటా పంచ్ వర్సెస్ మారుతి ఫ్రాంక్స్, ఏది మంచిదో ఇలా తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook