Kia Seltos: గత కొద్దికాలంగా ఇండియాలో ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. కస్టమర్లలో ఎస్‌యూవీపై ఉన్న ఆసక్తి ఆధారంగా హ్యుండయ్, టాటా, మారుతి, కియా కంపెనీలు ఎప్పటికప్పుుడు కొత్త ఫీచర్లు అప్‌డేట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా అప్‌డేట్ అయిన కియా సెల్టోస్‌కు ఆదరణ పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి కియా సెల్టోస్ ఎస్‌యూవీ మొదటిసారిగా 2019లో లాంచ్ అయింది. ఆ తరువాత ఇందులో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇటీవల లాంచ్ అయిన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్తగా చాలా ఫీచర్లు వచ్చి చేరాయి. ఇందులో కీలకమైన అప్‌డేట్‌గా లెవెల్ 2 ADAS చెప్పవచ్చు. మూడు రాడార్లు ఉన్నాయి. లెవెల్ 2 ADASలో 17 కొత్త సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయాన్ని పరిశీలిస్తే ఇందులో 15 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంటే మొత్తం 32 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 


కియా సెల్టోస్ ADAS ఫీచర్లు


ఫ్రంట్ కోలిజన్ వార్నింగ్, ఫ్రంట్ కోలిజన్ అసిస్టెన్స్, ఫ్రంట్ కోలిజన్ పెడెస్ట్రియన్, ఫ్రంట్ కొలిజన్ సైక్లర్, ఫ్రంట్ కొలిజన్ జంక్షన్ టర్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, స్టాప్ అండ్ గో విత్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ ఇలా చాలా సరికొత్త అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉన్నాయి. 


ఇవి కాకుండా స్టాండర్డ్ ఫీచర్ల గురించి పరిశీలిస్తే..యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ ఫోర్స్ అసిస్ట్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్,  హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎమర్జన్సీ టైర్ ప్రెషర్ మోనిటర్, హైలైన్ టైర్ ప్రెషర్ మోనిటర్, రేర్ పార్కింగ్ సెన్సార్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ఫ్రంట్ సీట్ సైడ్, సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్ ఉన్నాయి.


కియా సెల్టోస్ ధర 10.90 లక్షల నుంచి 20 లక్షల వరకూ ఉంది. వేరియంట్ బట్టి ధర మారుతుంటుంది. అదే విధంగా హ్యుండయ్ క్రెటా ధర 10.87 లక్షల నుంచి 19.20 లక్షల వరకూ ఉంది. అంటే రెండింటి ధరలూ దాదాపుగా ఒకటే గానీ ఫీచర్లు కియా సెల్టోస్‌లో అధికంగా ఉన్నాయి.


Also read: Hyundai Creta: హ్యుండయ్ క్రెటాలో తక్కువ ధర మోడల్ ఇదే, ఫీచర్లు ఇలా ఉన్నాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook