Kia Seltos: దేశంలో వివిధ రకాల కార్ల కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క రకం కార్లు ప్రవేశపెడుతూ సరికొత్త ఫీచర్లు అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలో అత్యధిక ఆదరణ పొందుతున్న కియా మోటార్స్ మరో కొత్త మోడల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుండయ్, హోండా కంపెనీలతో పాటు కియా మోటార్స్ కంపెనీ కార్లు కూడా దేశంలో విశేష ఆదరణ పొందుతున్నాయి. దేశంలో అత్యధికంగా విక్రయమౌతున్న ఎస్‌యూవీ కియా సెల్టోస్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో మార్కెట్‌లో రానుంది. జూలై 4వ తేదీన కియా మోటార్స్ కంపెనీ ఈ మోడల్ లాంచ్ చేయనుంది. కారు ధర ఇతర వివరాల్ని మాత్రం జూలై నెలాఖరునాటికి అందించవచ్చు. 2019లో ఇండియాలో లాంచ్ అయినా కియా సెల్టోస్ చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఇదే కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ ద్వారా ఈ కారు ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ మార్పులు, అదనపు ఫీచర్లు అందించనుంది. ఫీచర్లు అదనంగా వస్తున్నందున ధర కూడా పెరగవచ్చని తెలుస్తోంది. 


సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఫ్రంట్ బంపర్ ప్రత్యేకమైన డిజైన్‌తో ఉంటుంది. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌‌లో కొత్త హెడ్ ల్యాంప్స్‌తో రీ డిజైన్ చేశారు. ఇందులో కూడా ఇంటర్నల్ ఎల్ఈడీ డే టైమ్ రన్నింగ్ ల్యాంప్, గ్రిల్ ఉంటాయి. బంపర్‌లో కొత్త ఫాగ్ ల్యాంప్ మరో ప్రత్యేకత. ప్రొఫైల్ పరంగా పెద్దగా మారుల్లేవు. ఇందులో 17 ఇంచెస్ ఎల్లోయ్ వీల్ ఉంటుంది. ఇక సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ప్రస్తుత మోడల్ కారులో 115 హెచ్‌పి పవర్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 116 హెచ్‌పి ఉంటాయి. ఈ ఫేస్‌లిఫ్ట్ తో పాటు టర్బో పెట్రోల్ ఇంజన్ మరోసారి ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ మోడల్ కారు 1.5 లీటర్ యూనిట్ ఉండి 160 హెచ్‌పి పవర్, 253 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.


కియా సెల్టోస్ ఇంటీరియర్‌లో అన్నింటికంటే ప్రధానమైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు కొత్త ట్విన్ స్క్రీన్ లే అవుట్ ఉంటుంది. ఈ కారు ఫీచర్లలో పనోరమిక్ సన్‌రూఫ్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ఉన్న తొలికారు కియా సెల్టోస్ కానుంది. దీంతోపాటు ఇందులో హిల్ అసిస్ట్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్, వెహికల్ కంట్రోల్ వ్యవస్థ ఉన్నాయి. 


Also read: ESIC Scheme: ఈఎస్‌ఐసీ కింద భారీగా సభ్యులు నమోదు.. ఏప్రిల్‌లో 17.88 లక్షల మంది చేరిక



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook