Kia Sonet Features: దక్షిణ కొరియా ఆటోమేకర్ కియా ఇండియా కొత్త సోనెట్ కార్ల ప్రీ బుకింగ్‌లు ప్రారంభించినట్లు ప్రకటించింది. కారు త్వరగా కావాలని అనుకునేవారు రూ.25 వేలు టోకెన్ అమౌంట్ చెల్లించి.. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. కొత్త సోనెట్ డెలివరీలు జనవరి 2024లో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 2024న డీజిల్ MT వేరియంట్‌లు మార్కెట్‌లోకి రానున్నాయి. కొత్త కారుకు సంబంధించిన ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కియా ఇండియా ఎండీ, సీఈవో టై జిన్ పార్క్ మాట్లాడుతూ.. తమ రెండో బెస్ట్ సెల్లర్ సోనెట్ కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించినందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. భారత్‌ తమ వ్యాపారం సక్సెస్ కావడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషించిందన్నారు.  కియాలో అత్యధికంగా అమ్ముడైన రెండో కార్లు సోనెట్ మోడల్ అని చెప్పారు. ఈ మోడల్ కార్లు ప్రపంచవ్యాప్తంగా 3.6 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. మన దేశలో 2.84 లక్షల కార్లను విక్రయించింది. ఇది కియా ఇండియా మొత్తం దేశీయ అమ్మకాలలో 33 శాతం వాటా. భారీ పోటీ ఉన్న కాంపాక్ట్ SUV విభాగంలో గత మూడేళ్లలో సోనెట్ స్థిరంగా 13 శాతం సెగ్మెంట్ వాటాను కలిగి ఉండడం విశేషం.


కొత్త సోనెట్‌ మోడల్‌లో మరిన్ని ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు యాడ్ చేశారు. ఇందులో 15 హై-సేఫ్టీ ఫీచర్లు, 10 ADAS ఫీచర్లు ఉన్నాయి. దీంతో పాటు ఈ విభాగంలో సురక్షితమైన కాంపాక్ట్ SUVలలో ఇది ఒకటి అని కంపెనీ వెల్లడించింది. సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), హింగ్లీష్ కమాండ్‌లు, వాలెట్ మోడ్‌తో సహా ఫైండ్ మై కార్‌తో సహా 70+ కనెక్ట్ చేసిన  ఫీచర్‌లు కూడా ఉన్నాయి.


1.2L పెట్రోల్ (83PS, 5MT), 1.0L టర్బో (120PS, 6iMT/7DCT), 1.5L డీజిల్ (116PS, 6MT/6iMT/6AT) వేరియంట్లలో అందుబాటులోకి రానున్నాయి. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, LED సౌండ్ యాంబియంట్ లైటింగ్, 10.25 అంగుళాల HD టచ్‌స్క్రీన్ నావిగేషన్, 10.25 అంగుళాల క్లస్టర్ ప్యానెల్, ఇతర ఫీచర్‌లతో పాటు సరౌండ్ వ్యూ మానిటర్‌తో ఫైండ్ మై కార్ వంటి  బెస్ట్ ఫీచర్లు ఉండనున్నాయి.


Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ


Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook