FD vs KVP Interest Rates: ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆలోచన ఉంటే ఇది మీ కోసమే. ప్రభుత్వ పథకాల్లో బ్యాంకుల కంటే అధిక వడ్డీ లభిస్తోంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువగా.. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు రెపో రేటు పెరిగిన తరువాత ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డిఎఫ్‌సి, పీఎన్బీ, యాక్సిస్ బ్యాంకులతో పాటు దాదాపు అన్ని బ్యాంకులు ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచాయి. మీరు కూడా మీ డబ్బుల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తుంటే..బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే ప్రభుత్వ పథకం గురించి తెలుసుకోవాలి. 


బ్యాంకుల వడ్డీ రేట్లను ఓసారి పరిశీలిస్తే..అన్నింటికంటే ఎక్కువగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ వడ్డీ అందిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై పీఎన్బీ 5.50 నుంచి 5.60 వరకూ వడ్డీ ఇస్తోంది. 


ఎఫ్‌డీలపై ఏ బ్యాంకు వడ్డీ ఎంత


హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు                  5.50 శాతం
ఐసీఐసీఐ బ్యాంకు                          5.50 శాతం
ఎస్బీఐ                                           5.50 శాతం
యాక్సిస్ బ్యాంకు                           5.50 శాతం
పంజాబ్ నేషనల్ బ్యాంకు              5.60 శాతం
కిసాన్ వికాస్ పత్ర్                           6.90 శాతం


బ్యాంకుల్లో ఎఫ్‌డీ కాకుండా పోస్టాఫీసులో కిసాన్ వికాత్ పత్ర్‌లో మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కిసాన్ వికాస్ పత్ర్‌పై ఇప్పుడు వడ్డీ రేటు 6.90 శాతంగా ఉంది. ఇది బ్యాంకుల ఎఫ్‌డీ వడ్డీరేట్లతో పోలిస్తే చాలా ఎక్కువ.


ఈ పధకం వ్యవధి 124 నెలలు అంటే 10 ఏళ్ల 4 నెలలు. ఒకవేళ ఈ పథకంలో 2022 ఏప్రిల్ 1 నుంచి 2022 జూన్ 30 మధ్యలో పెట్టుబడి పెట్టి ఉంటే..మీరు జమ చేసిన నగదు మొత్తం..పదేళ్ల నాలుగు నెలల వ్యవధిలో రెట్టింపు అవుతుంది. కిసాన్ వికాత్ పత్ర్‌లో మీరు 1000, 5000,10000,50000 వేలుగా పెట్టుబడి పెట్టవచ్చు.. అది కాకుండా కిసాన్ వికాస్ పత్ర్‌ను కొల్లాటెరల్ లేదా సెక్యూరిటీగా పెట్టుకుని రుణం తీసుకోవచ్చు.


Also read: Multibagger Stocks: ఏడాదిలో లక్ష రూపాయల్ని..27 లక్షలు చేసిన షేర్, మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రయోజనాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook