Credit Card New Rules: బ్యాంకింగ్ రంగంలో కీలకమైన అప్‌‌డేట్ విడుదలైంది. ముఖ్యంగా క్రెడిట్ కార్టుల విషయంలో ఆర్బీఐ కొత్తగా నిబంధనలు ప్రవేశపెట్టింది. అవేంటంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిత్య జీవితంలో ఎప్పటికప్పుడు తెలుసుకోవల్సిన అప్‌డేట్స్‌లో బ్యాంకింగ్ ఒకటి. బ్యాంకింగ్ నిబంధనలు, ఏటీఎం లావాదేవీల విషయంలో కొత్త కొత్త నిబంధనలు వస్తుంటాయి. క్రెడిట్ కార్డుల విషయంలో ఆర్బీఐ కొత్తగా కొన్ని నిబంధనలు ప్రవేశపెట్టింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1 నుంచి అంటే రేపట్నించి అమల్లో రానున్నాయి. 


క్రెడిట్ కార్డు. ఇప్పుడిది  ఓ నిత్యావసరంగా మారుతున్న పరిస్థితి. షాపింగ్ కోసమో, అత్యవరాల కోసమో ఉపయోగపడే వస్తువు. ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఛార్జీల బాదుడు తప్పదు. అందుకే వినియోగదారుల అవగాహన కోసం అటు ఆర్బీఐ కూడా సంబంధిత బ్యాంకులకు సూచనలు జారీ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే క్రెడిట్ కార్డు విషయంలో కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఇవి జూన్ 1 నుంచి అమల్లో రానున్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..


వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు క్రెడిట్ కార్డుల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సూచనలు జారీ చేసింది. కార్డు నిర్వహణలో లోపాలపై జవాబుదారీతనం ఉంటుందనే బాధ్యతను గుర్తు చేస్తోంది. కార్డును మార్చడం లేదా పరిమితి పెంచే విషయంలో వినియోగదారుడి అనుమతి తప్పనిసరి. వినియోగదారుడికి తెలియకుండా పరిమితి పెంచి..ఛార్జీలు విధించేందుకు వీల్లేదు. అలా చేస్తే విధించిన ఛార్జీలకు రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.


మరోవైపు క్రెడిట్ కార్డు కనీస మొత్తం చెల్లించే విషయమై అవగాహన కల్పించాలి. కనీస మొత్తం అంటే మినిమమ్ బిల్లు చెల్లించడం ద్వారా పూర్తి బకాయి తీరేందుకు చాలా కాలం పడుతుందని..అధిక వడ్డీ భారమౌతుందని వినియోగదారుడికి అర్ధమయ్యేలా..బిల్లుపై స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. 


క్రెడిట్ కార్డు దరఖాస్తును సంబంధిత బ్యాంకు తిరస్కరిస్తే ఎందుకు తిరస్కరించారనేది రాతపూర్వకంగా  దరఖాస్తుదారునికి తెలియజేయాలి. ఏ కారణమనేది వివరించాలి. కార్డు పోయినప్పుడు జరిగే అనధికార లావాదేవీల నష్టాన్ని భర్తీ చేసేందుకు ఇకపై భీమా పాలసీ పొందవచ్చు. తద్వారా బ్యాంకుకు, వినియోగదారుడికి నష్టం ఉండదు. వినియోగదారుడు ఎవరైనా కార్డు రద్దు చేయాలనుకుంటే..ఆ ప్రక్రియను ఏడురోజుల్లోగా పూర్తి చేయాలి. లేకపోతే 5 వందల వరకూ జరిమానా తప్పదు. కార్డు ఏడాదిపాటు వినియోగించకపోతే..నెల రోజుల నోటీసుతో ఆ కార్డు రద్దు చేసే అధికారం సంబంధిత బ్యాంకులకు ఉంటుంది. అదే సమయంలో కార్డు జారీ చేసిన నెలరోజుల్లోగా ఓటీపీ ద్వారా యాక్టివేట్ చేసుకోవల్సి ఉంటుంది. 


Also read Cheapest Recharge Plan: కేవలం రూ.141 రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ... పూర్తి వివరాలివే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook