Koo app Shutdown here reason: ‘కూ’ యాప్ ను నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ మైక్రోబ్లాగింగ్ యాప్ ను 2019 లో ఆవిష్కరించారు.ఈ యాప్ ను అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి ప్రారంభించారు. ఈ యాప్ అతి తక్కువ కాలంలో అత్యంత జనాదరణ పొందింది. ట్విటర్ కు పోటీగా కూ గట్టిపొటిని ఇచ్చిందని చెప్పుకొవచ్చు. అంతేకాకుండా.. కూ అనేది మన దేశీయంగా తయారు చేయబడిన మైక్రోబ్లాగీంగ్ యాప్. ప్రజలు తరచుగా సోషల్ మీడియా బ్లాగ్స్ లతో పాటు, కూను కూడా అంతే ఆదరించారు. ఒక వేళ ట్విటర్ లు, ఫేస్ బుక్ లో ఇబ్బందులు తలెత్తినప్పుడు యూజర్లు.. కూ ను కూడా ఫాలో అయ్యేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read more: Serial bride: నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్.. లబో దిబో మంటున్న యువకులు.. ఎక్కడో తెలుసా..?


ఈ నేపథ్యంలో స్థానిక భాషల్లో కూడా తమ విషయాలను, పోస్టులను కూలో పోస్టులు చేసే అవకాశం ఉండేది.  అందుకే అతి తక్కువ కాలంలో అత్యంత జనాదరణ పొందింది. అతి తక్కువ కాలంలోనే దీనికి భారీగా యూజర్లు క్రియేట్ అయ్యారు. కానీ  కూ యాప్ కూడా ఆర్ధిక కష్టాలు తప్పలేదు. కొన్నిరోజులుగా ఈ యాప్  నిర్వహణకు నిధులు కొరత సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. యూజర్ ల సంఖ్య భారీగా పెరిగినప్పటికి.. ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినాయంట. దీని వల్ల లే ఆఫ్ లను సైతం కంపెనీ ప్రకటించింది.


కానీ గతంలో ఈ కూ యాప్ ను.. కేంద్ర మంత్రులు సైతం.. ఆత్మనిర్భర్ యాప్ గా దీన్ని ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పలు కంపెనీలు, మీడియా హౌస్ లు, కొద్దిమందితో దీని టేకోవర్ విషయంలో చర్చలుజరిగిన కూడా అవేం సఫలంకాలేదు. ఈ క్రమంలో.. కూ ను మూసివేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు, మయాంక్ వెల్లడించారు. ఇక అందుకే కూ యాప్ కార్యకలాపాలు నిలిపివేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఆ నోట్ ను ముఖ్యంగా.. స్థానిక భాషలకు పెద్ద పీట వేస్తూ దేశీయ యాప్‌ను రూపొందించామని, ఒక దశలో 21 లక్షల డైలీ యాక్టివ్‌ యూజర్లను కూడా ‘కూ’ సొంతం చేసుకుందని వెల్లడించారు.


Read more:Snake bite: ఇదేం విడ్డూరం.. నెల వ్యవధిలో 5 సార్లు కాటేసిన పాము.. స్టోరీ తెలిస్తే షాక్ అవుతారు..


కానీ నిధుల కొరత ఇబ్బందిగా మారిందని, తమ ప్రయత్నాలేవీ ఫలించలేదని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే.. కూ కు నిర్వహించడానికి నిధులు లేకపోవడం వల్లనే మూసివేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇప్పుడు చాలా మంది కూ యూజర్ లు మాత్రం సోషల్ మీడియాలో షాక్ కు గురౌతున్నారు. తమ దేశీయ యాప్ ను మరల పునరుద్ధరించడానికి సంస్థలు, వ్యాపార వేత్తలు ముందుకు రావాలంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి