3M Global Manufacture Company To Cut Jobs 2500: గ్లోబల్ లేఆఫ్‌ లిస్టులో మరో కంపెనీ చేరింది. ప్రముఖ దిగ్గజం కంపెనీ 3M ఇప్పుడు 2500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో కంపెనీకి తక్కువ లాభాలు.. డిమాండ్‌ తగ్గడం వంటి కారణాలతో ఉద్యోగుల తొలగింపునకు నిర్ణయం తీసుకున్నారు. 3M కంపెనీ ఉత్పాదక రంగంలో పెద్ద కంపెనీగా ఉంది. ఇది ఎలక్ట్రిక్ నుంచి ఆరోగ్య రంగం వరకు చిన్న, పెద్ద ఉత్పత్తులను తయారు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఈ దిగ్గజం కంపెనీ ప్రజల కోసం మాస్క్‌లను కూడా తయారు చేసింది. అయితే గతేడాది కంపెనీకి చెందిన పలు ఉత్పత్తుల సరఫరాలో క్షీణత ఉంది. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా ఈ కంపెనీ వ్యాపారాన్ని ప్రభావితం చేసింది. 3M నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో ఏడాది క్రితం $1.4 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది త్రైమాసికంలో సంవత్సరానికి $541 మిలియన్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం 6.2% తగ్గి 8.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 


ఉద్యోగుల తొలగింపు గురించి సమాచారం ఇస్తూ కంపెనీ సీఈఓ మైక్ రోమన్ మాట్లాడారు. 2023లో విస్తృతమైన ఆర్థిక సమస్య ఏర్పడవచ్చని అన్నారు. దీని కారణంగా తాము మార్కెట్‌లో కొనసాగడానికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 2,500 మంది ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించారు. కంపెనీ నష్టాలు, లాభాల నిర్వహణకు ఈ నిర్ణయం అవసరమని అన్నారు. 


రిట్రెంచ్‌మెంట్‌కు సంబంధించిన ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ సంవత్సరం యూఎస్‌లో చాలా తక్కువ వృద్ధిని కంపెనీ అంచనా వేస్తుంది. అయితే గ్లోబల్ లాభం 1.5 శాతం కంటే తక్కువగా ఉంటుంది. ఉత్పత్తుల తయారీని కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా 3M కంపెనీ కూడా ఉద్యోగుల తొలగింపు ప్రకటన రావడం ఆందోళనకు గురిచేస్తోంది.


Also Read: Tirupati Accident: వెంటాడిన దురదృష్టం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి   


Also Read: President Droupadi Murmu Speech: గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.. జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి