LIC IPO: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్​ఐసీ ఐపీఓకు మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం గత కొంత కాలంగా తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం ఐపీఓకు వచ్చేందుకు యుద్ధప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేసింది. సెక్యూరిటీస్​ ఎక్స్ఛేంజ్ బోర్ట్ ఆఫ్ ఇండియా (సెబి)కి ఈ మేరకు దరఖాస్తు చేసుకోగా.. ఇందుకు ఆమోదం కూడా లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తేదీని ప్రకటించకపోయినా.. మార్చిలో ఐపీఓ ఫిక్స్​ అనేది తెలిసింది. అయితే అన్ని సజావుగా సాగుతున్నాయనుకునేలోపే.. రష్యా ఉక్రెయిన్​ యుద్ధం రూపంలో అనుకోని సమస్య వచ్చి పండింది.


రష్యా-ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో దాదాపు 10 రోజులుగా దేశీయ, అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ వస్తున్నాయి. రష్యన్ మార్కెట్లు ఏకంగా తాత్కాలికంగా మూతపడ్డాయి. ఇక మన మార్కెట్ల విషయానికొస్తే.. బీఎస్​ఈ, ఎన్ఎస్​ఈలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ నేడు​ 769 పాయింట్లు కోల్పోయి.. 54,333 పాయింట్ల వద్దకు చేరింది. ఇక ఎన్​ఎస్ఈ-నిఫ్టీ 253 పాయింట్ల నష్టంతో 16,245 వద్ద ముగిసింది.


ఇంకొన్నాళ్లు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ నెలలో ఎల్​ఐసీని ఐపీఓకు తెచ్చే ప్లాన్​ను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. చాలా మంది ఫండ్​ మేనేజర్లు, ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపఫథ్యంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎల్​ఐసీ ఐపీఓను వాయిదా వేసినట్లు సమాచారం. దీనిపై వచ్చే వారం అధికారిక ప్రకటన రావచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఎల్​ఐసీ ఐపీఓ గురించి..


ప్రభుత్వం ఆదాయపు అంచనాల్లో భాగంగా ఎల్​ఐసీలో 5 వాటాను ఐపీఓకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. మొత్తం దాదాపు రూ.60 వేల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. ఇది పూర్తయితే దేశంలో అతి పెద్ద ఐపీఓ కానుంది.


Also read: Pawan Kalyan: పవన్ కల్యాణ్​ హిట్టు సినిమాల్లో రీమేక్​లే ఎక్కువట!


Also read: OPPO A74 Amazon: రూ.3 వేలకే OPPO 5జీ స్మార్ట్ ఫోన్.. ఈ ఒక్కరోజు మాత్రమే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook