LIC Jeevan Labh Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీలలో ఒకటి. పెట్టుబడి దారులను ఆకర్షిస్తూ అనేక పాలసీలను తరచూ ప్రవేశపెడుతుంది. పెట్టుబడి దారులకు సురక్షితమైన, రిస్క్ లేని పెట్టుబడి ఎంపికలను LIC అందజేస్తుంది. ఈ LIC పాలసీల ద్వారా ఆర్థిక భద్రతతో పాటు పిల్లల చదువులు, వివాహం, పదవీ విరమణ తర్వాత భవిష్యత్తు ప్రణాళికలను దృష్టిలో ఉంచుకొని ఈ పెట్టుబడులు జరుగుతుంటాయి. ఈ పెట్టుబడులను క్రమం తప్పకుండా చేయడం వల్ల మెరుగైన రాబడిని పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIC జీవన్ లాభ్ పాలసీ అనేది బీమాపై పొదుపు ఎంపికతో కూడిన ఎండోమెంట్ పాలసీ. గతేడాది ఫిబ్రవరి 1న ప్రారంభించిన ఈ పాలసీ ద్వారా.. దురదృష్టవశాత్తూ పాలసీదారుడు మరణించినా, నామినీకి ఈ పాలసీ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న వారు కొంతకాలం తర్వాత రుణాలు కూడా తీసుకునే అవకాశాన్ని కల్పించింది. డెత్ బెనిఫిట్, పాలసీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ సహా ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.


LIC జీవన్ లాభ్ పాలసీలో.. పెట్టుబడి పెట్టడం ద్వారా పాలసీ మెచ్యూరిటీ సమయానికి లక్షల రూపాయలను పొందే అవకాశం ఉంది. రోజుకు రూ.262 చొప్పున నిర్ణిత గడుపులోపు పాలసీలో పెట్టుబడి పెడితే.. దాదాపుగా రూ.20 లక్షల వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. 


జీవన్ లాభ్ పాలసీ వివరాలు


LIC జీవన్ లాభ్ పథకంలో కనీస బీమా మొత్తం రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఈ పాలసీ బీమాపై గరిష్ట పరిమితి లేదు. బీమా పరిమితిని ఎంత పెంచితే నెలవారీ పెట్టుబడి అంతగా పెరిగిపోతుంది. ఈ పాలసీ మెచ్యురిటీకి కనీసం 8 ఏళ్ల సమయం పడుతుంది. 


అయితే ఈ పాలసీ వయోపరిమితిని 16, 21, 25 ఏళ్లకు కూడా మెచ్యురిటీ టైమ్ ను పెంచుకునే అవకాశం ఉంది. జీవన్ లాభ్ పాలసీ కింద పెట్టుబడి పెట్టేవారు నెలవారీగా లేదా మూడు నెలలకు లేదా ఆరు నెలలకు లేదా ఏడాదికి ఒకసారి తమతమ ప్రీమియంలను చెల్లించవచ్చు. నెలవారీ చెల్లింపులపై 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.  


Also Read: Flipkart Sale: రూ.20,990 విలువైన వివో టీ1 5జీ ఫోన్ కేవలం రూ.490కే.. లిమిటెడ్ ఆఫర్​!


Also Read: Flipkart Mi Smart TV: రూ.30 వేల విలువైన Mi స్మార్ట్ టీవీ.. ఇప్పుడు రూ. 10,499లకే అందుబాటులో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook