LIC Policy: మీ అమ్మాయి కోసం బెస్ట్ స్కీమ్, మెచ్యురిటి తరువాత 22 లక్షల ప్రయోజనం
LIC Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో అద్భుతమైన స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 22 లక్షల రూపాయలు లభించడమే కాకుండా ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Policy: ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్పెషల్ స్కీమ్ పిల్లల భవిష్యత్‌కు, చదువుల నిమత్తం లేదా పెళ్లి ఖర్చు కోసం పననికొస్తుంది. ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్ పూర్తిగా జీరో రిస్క్‌తో కూడుకున్నది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీలో చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరికీ వేర్వేరు పాలసీలు ఉన్నాయి. మెచ్యూరిటీ తరువాత అధిక ప్రయోజనాలతో పాటు ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. అలాంటి స్కీమ్ ఇది. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 22.5 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. ఎల్ఐసీ అందిస్తున్న ఈ పాలసీ మీ అమ్మాయి భవిష్యత్తుకు, పెళ్లికి లేదా చదువుకు పనిచేస్తుంది. ఈ పాలసీ పేరు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ. ఇందులో ప్రీమియం నెలకు, మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లించవచ్చు. 25 ఏళ్ల టెర్మ్ ప్లాన్ ఎంచుకుంటే ప్రీమియం 22 ఏళ్ల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్ల తరువాత ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ప్రీమియం చెల్లించేది మాత్రం 22 ఏళ్లే. ఈ టర్మ్ ప్లాన్ 13 నుంచి 25 ఏళ్ల వరకు ఉంటుంది. మెచ్యూరిటీ వ్యవధి పూర్తయ్యాక భారీగా డబ్బులు చేతికి అందుతాయి. ఈ పాలసీ ప్రారంభించేందుకు అమ్మాయి తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్లలోపు ఉండాలి.
ఈ పాలసీ తీసుకున్నవారికి మూడో ఏడాది నుంచి రుణ సౌకర్యం ఉంటుంది. పాలసీ క్లోజ్ చేయాలంటే రెండేళ్ల తరువాత ఎప్పుడైనా క్లోజ్ చేయవచ్చు. అంతేకాకుండా ప్రీమియం చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ 30 రోజులు ఉంటుంది. ఈ పాలసీ తీసుకుంటే ట్యాక్స్ మినహాయింపు కూడా వర్తిస్తుంది. చెల్లించిన ప్రీమియంపై సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. కనీసం 1 లక్ష రూపాయల నుంచి పాలసీ ఉంటుంది. గరిష్టంగా పరిమితి లేదు.
25 ఏళ్ల ప్లాన్ తీసుకుని ఏడాదికి 41,3667 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే నెలకు 3,445 రూపాయలు అవుతుంది. ఇలా 22 ఏళ్ల పాటు చెల్లించాలి. మరో మూడేళ్లు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. 25 ఏళ్లు పూర్తయ్యాక 22.5 లక్షల రూపాయలు అందుతాయి. మధ్యలో అమ్మాయి తండ్రి మరణిస్తే ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాకుడా 25 ఏళ్లు పూర్తయ్యేవరకూ ఏడాదికి 1 లక్ష రూపాయలు అమ్మాయికి అందుతాయి. 25 ఏళ్లు పూర్తయ్యాక మొత్తం అందుతుంది. తండ్రి ఏదైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే నామినీకు డెత్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు అందుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook