LIC Policy: దేశంలో బీమా అందించే సంస్థలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఎల్ఐసీకు ఉన్న ఆదరణ ప్రత్యేకం. ఎప్పట్నించి దేశ ప్రజల ఆదరణ చూరగొన్న సంస్థ ఇది. ఎల్ఐసీ వివిధ రకాల పాలసీలు అందిస్తోంది. అందులో ఒకటి ధనరేఖ పాలసీ. ఈ పాలసీ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ మనీ బ్యాక్ పాలసీలు చాలా అందిస్తుంది. అందులో ఒకటి ఇప్పుడు మనం చెప్పుకునే ధనరేఖ పాలసీ. ఈ పాలసీని సింగిల్ ప్రీమియం కట్టి తీసుకోవచ్చు లేదా లిమిటెడ్ పీరియడ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. 55 ఏళ్ల వరకూ ఎవరైనా ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. పాలసీ కాల పరిమితి 20, 30, 40 ఏళ్లుంటుంది. మీ వీలుని బట్టి టర్మ్ ఎంచుకోవాలి.


మీ వయస్సు 30 ఏళ్లనుకుంటే..40 ఏళ్ల టర్మ్ 10 లక్షల బీమాకు తీసుకుంటే నెలకు ప్రీమియం 4950 రూపాయలుంటుంది. అంటే రోజుకు కేవలం 165 రూపాయలు మాత్రమే. 20వ సంవత్సరంలో 2 లక్షలు, 25వ సంవత్సరంలో 2 లక్షలు, 30వ సంవత్సరంలో 2 లక్షలు, 35వ సంవత్సరంలో 2 లక్షలు చేతికి అందుతాయి. ఇక చివరిగా 40వ సంవత్సరంలో ఏకంగా 29 లక్షలు తీసుకోవచ్చు. అంటే రోజుకు 165 రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో మెచ్యూరిటీ పూర్తయ్యాక 37 లక్షల మొత్తం వస్తుంది. 


ఇక ఎల్ఐసీ పాలసీలో మరో విషయమేంటంటే మీరు ప్రీమియం చెల్లించాల్సింది కేవలం 20 ఏళ్ల వరకే. అంటే 30 ఏళ్ల వయస్సులో పాలసీ తీసుకుంటే 49 ఏళ్ల వయస్సు వరకూ ప్రీమియం చెల్లించాలి. 30 ఏళ్ల టర్మ్ ప్లాన్ తీసుకుంటే 15 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే 20 ఏళ్ల టర్మ్ ప్లాన్ అయితే 10 ఏళ్లే ప్రీమియం చెల్లించాలి. అంటే తీసుకున్న టర్మ్ ప్లాన్‌లో సగం కాలానికే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. దీంతో పాటు ప్రమాద బీమా కూడా వర్తిస్తుంది. సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది. 


Also read: Health Insurance Tips: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా, ఈ సూచనలు తప్పక పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook