LIC Best Scheme: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు 12 లక్షలు రిటర్న్స్, ఎలాగంటే
LIC Best Scheme: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రత్యేక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇన్వెస్ట్రర్లకు అత్యధిక లాభాలు అందించడంలో భాగంగా ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం.
LIC Best Scheme: ఈ స్కీమ్ ఎల్ఐసీ అందిస్తున్న మ్యూచ్యువల్ ఫండ్ ఆధారితం. ఇందులో కనీస ఎస్ఐపీ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ 1000 రూపాయలు. ఈ స్కీమ్‌లో 10 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 12 లక్షలు అందుకోవచ్చు. అదెలాగనుకుంటున్నా..ఆ వివరాలు పరిశీలిద్దాం.
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అందిస్తున్న ఎస్ఐపీని 1000 రూపాయలతో ప్రారంభించవచ్చు. LIC MF డివిడెండ్ లాభం 60.25 శాతంగా ఉంది. ఎల్ఐసీ మ్యూచ్యువల్ ఫండ్స్ స్కీమ్‌లో ఇన్వెస్టర్లకు తక్కువ కాలంలో అద్భుతమైన రిటర్న్స్ అందాయి. ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్ పేరు LIC MF Dividend Yield. ఇందులో కనీసం 1000 రూపాయల నుంచి ప్రారంభించవచ్చు. నిఫ్టీలో బెంచ్ మార్క్ 500 ఉంది.. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్. స్టాక్ మార్కెట్ గురించి తెలియనప్పుడు నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టకూడదు. అలాంటి పరిస్థితుల్లో మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీ బెస్ట్ ఆప్షన్. మ్యూచ్యువల్ ఫండ్స్ ఎస్ఐపీలో ఇన్వెస్టర్లకు అధిక లాభాలు కలుగుతాయి.
LIC MF స్కీమ్‌తో అధిక లాభాలు
గత ఏడాది కాలంగా చాలావరకు మ్యూచ్యువల్ ఫండ్స్ స్కీమ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ముఖ్యంగా ఏడాది కాలంలో ఎల్ఐసీ మ్యూచ్యువల్ ఫండ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఐసీ మ్యూచ్యువల్ ఫండ్ డివిడెండ్ ఈల్ట్ ఫండ్ గత ఏడాది 60.25 శాతం సీఏజీఆర్ సాధించింది. అంతకుముందున్న బెంచ్ మార్క్ రిటర్న్ 37.13 శాతాన్ని దాటేసింది. మ్యూచ్యువల్ ఫండ్ స్కీమ్ గతంలో రిటర్న్స్ ప్రకారం ఇందులో ఎవరైనా ఇన్వెస్టర్ల నెలకు 10 వేల రూపాయలు 5 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది కాస్తా ఇప్పుడు 12 లక్షల 89, 9992 రూపాయలకు పెరిగి ఉండేది. అంటే వార్షిక రిటర్న్ 31.19 శాతం ఉంది.
ఎల్ఐసీ మ్యూచ్యువల్ ఫండ్ డివిడెండ్ టాప్ హోల్డింగ్స్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నాయి. టాప్ 5 స్టాక్స్‌లో ప్రతి ఒక్కటి స్కీమ్ ఎస్సెట్స్‌లో 2 శాతంపైగా దక్కించుకున్నాయి. ఎల్ఐసీ అందిస్తున్న మ్యూచ్యువల్ ఫండ్ డివిడెండ్ స్కీమ్ 2018లో ప్రారంభమైంది. ఆ సమయంలో 24.85 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
Also read: Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డు అంటే ఏమిటి, ఎవరికోసం ఇది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.