LIC Jeevan Anand Policy in Telugu: ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా ఉంటాయి. కొన్ని రిస్క్‌తో కూడుకున్నవి ఉంటాయి. మరి కొన్ని రిస్క్ లేకుండా గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చేవి ఉంటాయి. ఏ మాత్రం రిస్క్ లేకుండా అధిక ప్రయోజనాలు పొందేందుకు బెస్ట్ ఆప్షన్ ఎల్ఐసీ. అందుకే ఎల్ఐసీ పథకాలకు ఆదరణ చాలా ఎక్కువ. ఎల్ఐసీలో అలాంటిదే ఓ స్కీమ్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ అందిస్తున్న ఈ పాలసీ పేరు ఎల్ఐసీ జీవన ఆనంద్ పాలసీ. ఈ పాలసీలో మీరు 45 రూపాయలు రోజుకు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా పెద్దమొత్తంలో 25 లక్షల రూపాయలు అందుకోవచ్చు. ఇందులో ఒక లక్ష రూపాయల నుంచి పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా ఎంతైనా ఉంటుంది. ఇదొక టెర్మ్ పాలసీ. ఇందులో 4 రకాలుంటాయి. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజెబిలిటీ రైడర్, యాక్సిడెట్ బెనిఫిట్ రైడర్, న్యూ టెర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్. పాలసీదారుడు ఏదైనా కారణంగా చనిపోతే నామినీకు 125 శాతం డెత్ బెనిఫిట్ అందుతుంది. అదే సమయంలో ఈ డెత్ బెనిఫిట్‌పై ఎలాంటి ట్యాక్స్ ఉండదు.


18-50 ఏళ్ల వయస్సు కలిగినవారెవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. గరిష్టంగా మెచ్యూరిటీ వయస్సు 75 ఏళ్లు ఉంటుంది. పాలసీ కనీస వ్యవధి 15 ఏళ్లు కాగా గరిష్టంగా 35 ఏళ్లు. ఇందులో మీరు నెలకు, మూడు నెలలు, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చొప్పున ప్రీమియం చెల్లించవచ్చు. రెండేళ్లు పూర్తయిన తరువాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. పాలసీ క్లోజ్ చేసినప్పుడు  సరెండర్ వ్యాల్యూ మొత్తం చెల్లిస్తుంది. 


ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో భాగంగా మీరు 5 లక్షల పాలసీ తీసుకుంటే మీరు నెలకు చెల్లించాల్సిన ప్రీమియం 1358 రూపాయలు. అంటే రోజుకు 45 రూపాయలు మాత్రమే. ఏడాదికి మీరు చెల్లించేది 16,300 రూపాయలు అవుతుంది. ఏడాదికి 16,300 రూపాయలు చొప్పున చెల్లిస్తే 35 ఏళ్లకు 5,70,500 రూపాయలు జమ అవుతాయి. అంటే ఇది మీరు చెల్లించిన ప్రీమియం మొత్తం. 35 ఏళ్ల తురవాత దీనిపై అదనంగా 8.50 లక్షలు బోనస్ అందుతుంది. ఇది కాకుండా 11.50 లక్షలు అడిషనల్ బోనస్ వస్తుంది. అంటే మొత్తం 25 లక్షలు 35 ఏళ్లు మెచ్యూరిటీ పూర్తయ్యాక మీ చేతికి అందుతుంది. 


Also read: Hyundai i20 Discount: ఐ20పై భారీ డిస్కౌంట్ ఆఫర్, త్వరపడండి మరో రెండ్రోజులే మిగిలింది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.