LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్
Pradhan Mantri Vaya Vandana Yojana : ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును పొడిగించారు.
లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC) సీనియర్ సిటిజన్స్ కోసం ఓ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును 31 మార్చి 2023 వరకు పొడిగించారు.
పాలసీ గడువు మూడేళ్లు ముగిసిన తరువాత ఎల్‌ఐసీ పాలసీదారులు రుణాలు కూడా తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రధాన మంత్రి వయ వందన యోజనలో చేరాలంటే సీనియర్ సిటిజన్స్‌కు కనీస వయసు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో చేరాలనుకునే వృద్ధులు కనీసం రూ.1.44 లక్షలు పెట్టుబడి పెట్టాలి. గరిష్టంగా రూ.15 లక్షల వరకు నగదు చెల్లించి పీఎంవీవీవై పథకంలో చేరే అవకాశం ఉంది. ఇందులో చేరిన వారికి ఎల్ఐసీ ప్రతినెలా కనీసం రూ.1000, గరిష్టంగా రూ.10,000 వరకు పింఛన్ అందించనుంది.
Also Read: Airtel Offers: 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్‌టెల్ శుభవార్త, ఫ్రీ రీఛార్జ్ ప్లాన్
ఒకవేళ ప్రధాన మంత్రి వయ వందన యోజన పాలసీలో చేరిన తరువాత పదేళ్లలోపు పాలసీదారులు చనిపోతే డెత్ బెనిఫిట్స్ నామినీకి అందిస్తుంది. పదేళ్ల అనంతరం సీనియర్ సిటిజన్స్ జీవించి ఉంటే వారికి ప్రతి నెలా కనిష్టంగా రూ.1,000 నుంచి రూ.10,000 వరకు పెన్షన్ చెల్లిస్తారు. పాలసీదారుడికిగానీ వారి జీవిత భాగస్వామికిగానీ ఏదైనా ముఖ్యమైన అనారోగ్య సమస్యలు తలెత్తితే మీరు చెల్లించిన మొత్తం నుంచి 98 శాతం నగదు చెల్లించి పాలసీని ముగిస్తారు.
Also Read: Income Tax Benefits: ఇన్‌కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలా, ఈ Post Office స్కీమ్‌లో చేరండి
ఎల్ఐసీ PMVVY పథకం వివరాలు..
- పాలసీలో చేరడానికి కనీస వయసు 60 సంవత్సరాలు
- గరిష్ట వయసుకు ఎలాంటి రూల్స్ లేవు
- PMVVY Scheme టర్మ్ గడువు 10 సంవత్సరాలు
- పింఛన్ కనిష్టంగా ప్రతినెల రూ.1000 నుంచి గరిష్టంగా రూ.10,000 వరకు లభిస్తుంది
- ఈ స్కీమ్‌లో చేరే వారికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు
- PMVVYలో చేరడానికి తుది గడువు 31 మార్చి 2023
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook