LIC Dhan Vriddhi Scheme Details in Telugu: ప్రజలను ఆకర్షించేందుకు లైఫ్‌ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ (LIC) ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్స్‌ను తీసుకువస్తోంది. మీరు ఎల్‌ఐసీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ప్లాన్ చేస్తున్నట్లయితే మీకు ఓ గుడ్‌న్యూస్. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే.. లైఫ్‌ లాంగ్ ప్రయోజనాలను కల్పించే విధంగా ఎల్‌ఐసీ ఓ పాలసీని రూపొందించింది. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఆ పథకం పేరు ఏంటి..? ప్రయోజనాలు ఎలా ఉంటాయి..? వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ ప్లాన్ పేరు ధన్ వృద్ధి ప్లాన్. ఇది సింగిల్ ప్రీమియం ప్లాన్. అంటే ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే పరిపోతుంది. మీ జీవితాంతం ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. జీవిత రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలను పొందొచ్చు. అయితే పెట్టుబడిదారులు ఎప్పుడైనా ఈ ప్లాన్ నుంచి తప్పుకోవచ్చు. ఈ ప్లాన్‌ను ఎల్‌ఐసీ జూన్ 23వ తేదీన ప్రారంభించిందని.. సెప్టెంబర్ 30న మూగియనుంది. ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలని అనుకునేవారికి ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.


ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఎల్‌ఐసీ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ధన్ వృద్ధి పథకం గురించి పూర్తి వివరాలకు దగ్గరలో ఉన్న బ్రాంచ్‌ లేదా ఎల్ఐసీ ఏజెంట్‌ను సంప్రదించవచ్చు. ఎల్‌ఐసీ వెబ్‌సైట్ www.LICindia.inని సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ స్కీమ్‌పై ఎల్‌ఐసీ లోన్ సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ప్లాన్ తీసుకున్న 3 నెలల తర్వాత మీరు లోన్ పొందవచ్చు. 


ధన్ వృద్ధి ప్లాన్ ప్రత్యేకతలు ఇవే..


==> ఈ పథకం 10, 15, 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది.
==> పాలసీ అమలులో ఉన్న సమయంలో హోల్డర్ మరణిస్తే.. అతడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుంది
==> ఈ ప్లాన్‌లో 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. 
==> ధన్ వృద్ధి ప్లాన్‌లో ఎల్‌ఐసీ గ్యారంటీ హామీతో కూడిన రూ.1,25,000 ఆదాయం ఇస్తుంది.
==> ఇది మెచ్యూరిటీపై గ్యారంటీతో పాటు బీమా చేసిన వ్యక్తికి ఒకే మొత్తంలో భారీగా అందుతుంది.
==> పాలసీ పూర్తయిన 3 నెలల తర్వాత మీరు లోన్ పొందవచ్చు.


Also Read: Suryakumar Yadav: ఇదేం బాదుడు సూర్య భాయ్.. వరుసగా నాలుగు సిక్సర్లతో ఆ బౌలర్‌కు చుక్కలు  


Also Read: Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ లాంచ్, ఇంటర్నెట్ స్పీడ్, ఫ్రీ ఓటీటీ ఇతర ప్లాన్స్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి