Aadhaar Pan Link: జూలై 1లోపు పాన్-ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకోండి... లేదంటే మీకే నష్టం!
Aadhaar Pan Link: పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయకుంటే.. జూలై 1, 2022 నుంచి వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Aadhaar Pan Link: పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి ప్రభుత్వం గడువును మార్చి 31, 2022 నుండి మార్చి 31, 2023 వరకు పొడిగించింది. అయితే ఏప్రిల్ 1, 2022 నుండి పాన్ మరియు ఆధార్ కార్డ్‌ని లింక్ (Aadhaar Pan Link) చేయాలనుకున్న వారు రూ.500 ఫీజు చెల్లించాలి. మీరు జూన్ 30, 2022లోపు మీ ఆధార్ మరియు పాన్ కార్డ్‌ని లింక్ చేస్తే రూ. 500 వరకు మాత్రమే ఫైన్ ఉంటుంది. కానీ ఇది జూలై 1, 2022 నుండి రెట్టింపు అవుతుంది. ఆధార్-పాన్ లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయాలంటే... జూలై 1 నుండి రూ. 1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని సీబీడీటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆధార్ పాన్ లింక్ ప్రక్రియను మార్చి 31, 2022లోపు పూర్తి చేయకుంటే.. పాన్ కార్డ్ పనిచేయకుండా పోతుంది.
పాన్ కార్డ్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకోండిలా...
1. ముందుగా ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి - https://incometaxindiaefiling.gov.in/
2. అనంతరం క్విక్ లింక్స్ అనే సెక్షన్‌లో లింక్ ఆధార్ (Link Aadhar) అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి.
3. అనంతరం పాన్ నంబర్, ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి.
4. ఆ తర్వాత రూల్స్ ను అంగీకరిస్తున్నట్లు బాక్స్ లో టిక్ చేయాలి. అనంతరం కింద ఉండే లింక్ ఆధార్ బటన్ పై క్లిక్ చేయండి.
5. అనంతరం మీ పాన్ కార్డుకు లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వాలిడేట్ అప్షన్ క్లిక్ చేస్తే మీ పాన్ ఆధార్ లింక్ పూర్తవుతుంది.
Also Read: Whatsapp New Feature: వాట్సప్‌లో త్వరలో కొత్త ఫీచర్, ఎడిట్ ఆప్షన్‌పై పనిచేస్తున్న మెటా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook