Union Budget 2022 Live updates: క్రిప్టో కరెన్సీ, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నింగ్ ఫైల్, డిజిటల్ రూపీ, సహజ వ్యవసాయం, ఎల్ఐసి ఐపీఓ, ఈ-పాస్‌పోర్ట్ అంశాలపై కీలక ప్రకటన

Tue, 01 Feb 2022-1:23 pm,

Union Budget 2022 Live updates: వరుసగా నాలుగో సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్​ 2022 లైవ్​ అప్​డేట్స్​ మీకోసం..

Union Budget 2022 Live updates: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం నేడు పార్లమెంట్​లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్ 2022 ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్​ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది వరుసగా నాలుగోసారి కావడం విశేషం. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్​ పేపర్‌లెస్​ పద్ధతిలో ప్రవేశపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Union Budget 2022 App: సామాన్యులు సైతం బడ్జెట్ పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 'యూనియన్ బడ్జెట్ యాప్​'ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్​, యాపిల్ యాప్​ స్టోర్​ ద్వారా దీనిని డౌన్​లోడ్ చేసుకోవచ్చు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంతో పాటు.. వివిధ రంగాలకు కేటాయింపులు, అంచనాలు, విధాన నిర్ణయాలు, కీలక ప్రకటనలకు సంబంధించిన అన్ని వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.


Latest Updates

  • 12:55 Stock market update- స్టాక్ మార్కెట్ అప్​డేట్

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ 2022 ఉత్సాహం కొనసాగుతోంది.

    సెన్సెక్స్ 830 పాయింట్లకుపైగా లాభంతో 58,844 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. నిఫ్టీ 230 పాయింట్లకుపైగా పుంజుకుని.. 17,575 వద్ద కొనసాగుతోంది.

    దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పదిస్తున్నాయి.

    సన్​ ఫార్మా 6.10 శాతం, టాటా సీటీల్​ 4.96 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.89 శాతం లాభంతో దూసుకుపోతున్నాయి.

  • (12:35) Duty on unpolished diamonds-  డైమండ్స్​పై డ్యూటీ తగ్గింపు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    పాలీష్​  చేయని డైమండ్స్​పై డ్యూటీ 5 శాతానికి తగ్గింపు

    ఇతర ఉత్పత్తులతో కలపని ఇంధనాలపై అదనంగా లీటర్​కు 2 ఎక్సైజ్​ డ్యూటీని పెంపు

    దీర్ఘకాల మూలధన పెట్టుబడుల ద్వాార వచ్చే ఆదాయంపై 15 శాతం పన్ను విధింపు

  • (12:25) Highest GST collection- రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    2022 జనవరిలో రూ.1,40,986 కోట్లు జీఎస్​టీ వసూలైనట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​లో వెల్లడించారు. జీఎస్​టీ అమలులోకి వచ్చిన తర్వతా అత్యధిక వసూళ్లు ఇవేనని వెల్లడించారు. 

    ఈ సందర్భంగా పన్ను చెల్లింపుదారులందరికీ ఆర్థిక మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

  • Budget 2022 estimation: బడ్జెట్ 2022-23 అంచనా..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బడ్జెట్ 2022-23 అంచనా రూ.39 లక్షల కోట్లకుగా తెలిపారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.

    వచ్చే సంవత్సరానికి ఆదాయం అంచనా రూ.22.84 లక్షల కోట్లుగా పేర్కొన్నారు.

    దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యోలోటు 6.9 శాతంగా ఉండొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ వివరించారు.

  • (12:08) Rs 1Lakh crore allocated to states- రాష్ట్రాలకు కోసం ప్రత్యేక నిధి..

    రాష్ట్రాల ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు రూ.లక్షకోట్ల కేటాయింపు. ప్రత్యేక నిధితో రాష్ట్రాలకు రూ.లక్షకోట్ల వరకు వడ్డీ రహిత రుణాలు.

  • 12:00 Digital Rupee in Fiscal 2022-23- డిజిటల్ కరెన్సీ..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    అందరూ అంచనా వేసినట్లుగానే డిజిటల్​ కరెన్సీపై ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి.

    2022-23 ఆర్థిక సంవత్సరంలో డిజిటల్​ రూపీని అందుబాటలోకి రానుంది. బ్లాక్​ చైన్​, ఇతర సాంకేతికతలతో దీనిని రూపొందించినట్లు చెప్పారు ఆర్థిక మంత్రి.

    ఆర్​బీఐ ద్వారా డిజిటల్ రూపీ జారీ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి వివరించారు.

  • 11:55 Agricultural universities syllabus - వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్ : 

    ఆధునిక వ్యవసాయ పోకడలు అందిపుచ్చుకుని ఖర్చు లేకుండా సహజ పద్ధతిలో వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు దోహదపడే విధంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాల సిలబస్ సవరించేందుకు రాష్ట్రాలను ప్రోత్సహించనున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం..

    టెలికాం సంస్థలు 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన స్పెక్ట్రం వేలాన్ని 2022-23లో పూర్తి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

  • దేశవ్యాప్తంగా డిజిటల్​ పేమెంట్స్​ను ప్రోత్సహించేందుకు.. 75 జిల్లాల్లో.. 75 డిజిటల్​ బ్యాంకింగ్ యూనిట్స్. ఏర్పాటు చేయనున్నాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • Digital University - డిజిటల్ యూనివర్శిటీ:
    10:30 విద్యారంగంలో భోదనలో నైపణ్యం పెంపు కోసం చేస్తున్న కృషిలో భాగంగా డిజిటల్ యూనివర్శిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

  • పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    దేశవ్యాప్తంగా ఉన్న1.5 లక్షల పోస్టాఫీసులు 100 శాతం బ్యాంకింగ్ సేవల పరిధిలోకి వచ్చాయి.

    పోస్టాఫీస్ ఖాతా నుంచి బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ సేవలు నడుస్తున్నాయి.

    యూపీఐ, ఇంటర్నెట్​ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

  • ఈశాన్య రాష్ట్రాలకు ప్యాకేజ్​..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఈశాన్య రాష్ట్రాల కోసం త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నాం: నిర్మలా సీతారామన్​

    ఆయా రాష్ట్రాల అభివృద్ధికి కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ.. రూ.1,500 కోట్లు కేటాయింపు

  • నైపుణ్యాలు పెంపొందించేందుకు గాను దేశవ్యాప్తంగా త్వరలో డిజిటల్​ ఎకో సిస్టమ్​ ప్రారంభించనున్నాం: ఆర్థిక మంత్రి

  • ప్రధాన మంత్రి గతి శక్తి ప్రణాళికలో భాగంగా రైల్వేకు మరింత ఊతం: ఆర్థిక మంత్రి

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    1. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.

    2. 'స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు వన్​ స్టేషన్​ వన్​ ప్రోడక్ట్​ కాన్సెప్ట్​ను తీసుకురాన్నాం'

    3. వచ్చే మూడేళ్లలో మరో 100 కార్గో టర్మినల్​ల ఏర్పాటు..

  • 11:17 రానున్న  కాలంలో భారత్‌లో రసాయనరహిత వ్యవసాయం పద్ధతులను ప్రోత్సహించనున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

  • జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్ల మేర విస్తరించనున్నట్లు సీతారామన్​ పేర్కొన్నారు.

  • త్వరలోనే ఎల్​ఐసీ ఐపీఓకి రానున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

  • మేక్ ఇండియా ద్వారా దేశంలో 60 లక్షల ఉద్యోగాలు సృష్టించాం: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​..

  • 11:00 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ 2022 ను ప్రకటిస్తూ తన ప్రసంగం ప్రారంభించారు.

     

  • మార్కెట్లకు బడ్జెట్ 2022 దన్ను..

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    బడ్జెట్ 2022-23పై ఆశలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి.

    సెన్సెక్స్ 750 పాయింట్లకుపైగా లాభంతో 58,764 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పెరిగి 17,543 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • 10:20 బడ్జెట్ 2022 ప్రవేశపెట్టడానికంటే ముందుగా జరిగే కేబినెట్ భేటీలో పాల్గొనడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌కి చేరుకున్నారు.

  • 10:05 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి చేరుకున్నారు....
  • 10:05 కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కి చేరుకున్నారు. 11 గంటల నుంచి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. 

     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link