Union Budget 2023 Live udpates: రైల్వే, వేతన జీవులు, వ్యవసాయ రంగాలకు వరాలు
కేంద్ర ఆర్ధిక మంత్రి మరి కాస్సేపట్లో అంటే ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది 2022-23 కేంద్ర బడ్జెట్ 92 నిమిషాలు సాగింది. అదే ఇప్పటి వరకూ అతి చిన్న బడ్జెట్. ఈసారి బడ్జెట్ 2023-24 లైవ్ స్ట్రీమ్ సంసద్ టీవీ, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పీఐబీ కూడా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం చేయనుంది.
Union Budget 2023 Live updates: కేంద్ర ఆర్ధిక మంత్రి మరి కాస్సేపట్లో అంటే ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గత ఏడాది 2022-23 కేంద్ర బడ్జెట్ 92 నిమిషాలు సాగింది. అదే ఇప్పటి వరకూ అతి చిన్న బడ్జెట్. ఈసారి బడ్జెట్ 2023-24 లైవ్ స్ట్రీమ్ సంసద్ టీవీ, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. పీఐబీ కూడా వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం చేయనుంది.
2024 ఎన్నికలకు ముందు వచ్చే చివరి సంపూర్ణ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. నిర్మలా సీతారామన్‌కు ఇది 5వ బడ్జెట్. ఇన్‌కంటాక్స్‌కు సంబంధించిన సమస్యలు ఈ బడ్జెట్‌లో పరిష్కారం కావచ్చు.
Latest Updates
5 లక్షల నో ట్యాక్స్ లిమిట్ 7 లక్షలకు పెంపు
కొత్త ఆదాయపు పన్ను పథకంలో వర్తింపు2.5 లక్షల నుంచి 3 లక్షలకు జీరో ట్యాక్స్
3-5 లక్షలకు 5 శాతం ట్యాక్స్
6-9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను
15 లక్షలు దాటితే 30 శాతం పన్నుతగ్గనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు
5 కీలక ప్రకటనలు వ్యక్తిగత ఆదాయపు పన్నుతగ్గనున్న బ్రాండెడ్ దుస్తుల ధరలు
5 కీలక ప్రకటనలు వ్యక్తిగత ఆదాయపు పన్నుసేవింగ్ ఎక్కౌంట్ పరిమితి 4.5 లక్షల నుంచి 9 లక్షలకు పెంపు
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ పరిమితి 30 లక్షలకు పెంపు
మూడేళ్లపాటు 47 లక్షల మంది యువతకు స్టైఫండ్
పీఎం కౌశల్ యోజన కింద యువతకు సహాయంఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.
టీవీ ప్యానెళ్ల ధరలు తగ్గింపు
తగ్గనున్నటీవీ, మొబైల్ ధరలు
తగ్గనున్న కిచెన్ చిమ్నీ ధరలు
భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ వాహనాల ధరలుబంగారం, వెండి ధరలపై పెరగనున్న కస్టమ్స్ డ్యూటీ
పెరగనున్న సిగరెట్, టైర్ ధరలుకొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పెద్దపీట
నేషనల్ హైడ్రో గ్రీన్ మిషన్‌కు 19,700 కోట్లు
మేలో ఎన్నికల జరగనున్న కర్ణాటకలో వెనుకబడిన ప్రాంతాల సాగుకు 5,300 కోట్లు
2070 నాటికి కార్బన రహిత భారతదేశం లక్ష్యం
లడఖ్‌లో 13 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు
మిస్టీ పథకం ద్వారా మడ అడవుల అభివృద్ధి
5జి సర్వీసుల కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటుపీపీపీ విధానంలో వ్యవసాయ రంగ అభివృద్ధి
20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఏర్పాటు
తీర ప్రాంత రవాణాకు ప్రాధాన్యత
2030 నాటికి 5 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యం
దేఖో అప్నాదేశ్ పేరుతో పర్యాటక రంగం అభివృద్ధివ్యాపార సంస్థలకు ఇకపై పాన్ కార్డు ద్వారానే గుర్తింపు
మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ రెండేళ్ల కోసం ప్రారంభం
7.5 శాతం వడ్డీరేటుతో రెండేళ్ల కాల పరిమితితో మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పధకంత్వరలో దేశంలో 157 మెడికల్ , నర్శింగ్ కళాశాలల ఏర్పాటు
చిరుధాన్యాల పంటలు ప్రత్యేక ప్రోత్సాహం, గ్లోబల్ మిల్లెట్ హబ్ ఏర్పాటు
వ్యవసాయరంగానికి రుణ, మార్కెటింగ్ సదుపాయం
పీఎం ఆవాస్ యోజనకు 66 శాతం నిధుల పెంపు
రైల్వేకు 2.40 లక్షల కోట్లు కేటాయింపు
50 ఎయిర్ పోర్ట్‌లు , పోర్టుల అభివృద్ధి
నగరాల్లో మౌళిక వసతులకు అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్ ఏర్పాటు
అర్బన్ ఇన్‌ఫ్రా ఫండ్‌లో భాగంగా ఏడాదికి 10 వేల కోట్లు
75 వేల కోట్లతో 100 కీలక మౌళిక సదుపాయాల ఏర్పాటు2047 నాటికి రక్త హీనత నియంత్రణకు ప్రత్యేక చర్యలు
రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాల కోసం 13. 7 లక్షల కోట్లు
వ్యక్తిగత గుర్తింపుకై ఆధార్, పాన్ కార్డు డిజిటల్ లాకింగ్
కొత్తగా మూడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ల ఏర్పాటు81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఏర్పాట చేస్తాం. ఈపీఎఫ్ఓలో సభ్యుల సంఖ్యను రెట్టింపు, త్వరలో పీఎం విశ్వకర్మ యోజన ప్రారంభం, పర్యాటక రంగం ప్రోత్సాహానికి పెద్దపీట వేస్తాం.
గ్రీన్ గ్రీత్ కోసం చర్యలు తీసుకుంటాం..సికిల్ సెల్ వ్యాధిగ్రస్థులకు ప్రత్యేకంగా చేయూత అందిస్తాం.
పాఠశాల విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా నేషనల్ డిజిటల్ లైబ్రరీలను పంచాయితీ స్థాయిలో ఏర్పాటురానున్న మూడేళ్లలో ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల టీచర్ల నియామకం
కర్ణాటకలోని ఎగువ భద్ర ప్రోజెక్టుకు నిధుల కేటాయింపు
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఈ బడ్జెట్ అమృతకాలంలో అంటే 75 ఏళ్ల స్వాతంత్ర్యపు తొలి బడ్జెట్ అని మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఆర్ధిక మాంద్యంతో ఉన్నా...భారతదేశం 7 శాతం జీడీపీ సాధించిందని తెలిపారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనం కోసం ఆర్ధిక వృద్ధి ప్రయోజనాన్ని అందరికీ చేరేలా ప్రయత్నించామన్నారు.
సంస్కరణలపై దృష్టి సారించామని..పటిష్టమైన విధానాలతో 28 నెలల కాలంలో 80 కోట్లమందికి ఉచితంగా బియ్యం అందించామన్నారు. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరంలో 7 శాతం గ్రోత్ రేట్ ఉండవచ్చని మంత్రి తెలిపారు. ఇండియా ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగి ఉందన్నారు. ప్రతి వ్యక్తి ాదాయం రెట్టింపు కంటే పెరిగిందన్నారు. 11.4 కోట్ల మంది రైతులకు 2.2 లక్షల కోట్లను బదిలీ చేశామన్నారు.
Union Budget 2023 Live updates: కేంద్ర బడ్జెట్‌కు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన కేంద్ర కేబినెట్ సమావేశానికి హాజరైన మంత్రులు ముందుగా బడ్జెట్‌ను ఆమోదించారు. కాస్సేపట్లో అంటే 11 గంటలకు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతర కేంద్ర మంత్రులు పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాస్సేపట్లే కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ముందుగా కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంట్ చేరుకున్నారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి సమర్పించనున్న ఎన్డీయే ప్రభుత్వ చివరి బడ్జెట్‌కు ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము ఆమోదించారు. అనంతరం పార్లమెంట్‌కు చేరుకున్నారు. కాస్సేపట్లో ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించనుంది. అనంతరం అంటే ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బడ్జెట్ కంటే ముందే సెన్సెక్స్ గ్రీన్ కలర్‌లో ఓపెన్ అయింది. ప్రస్తుతం 437.32 వద్ద ట్రెండ్ అవుతోంది. మొత్తం సెన్సెక్స్ ఇప్పుడు 59,987,22 కు చేరుకుంది.
మరోవైపు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ నుంచి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బయలుదేరి..రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. బడ్జెట్‌పై రాష్ట్రపతి ఆమోదం తరువాత పార్లమెంట్‌కు చేరుకోనున్నారు.