Union Budget 2024-25 Live Updates: కేంద్ర బడ్జెట్ 2024.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు..

Tue, 23 Jul 2024-1:09 pm,

Union Budget Announcement 2024 Live In Telugu: లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మోదీ 3.O బడ్జెట్‌పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరిపై వరాల జల్లు కురిపించనున్నారు..? ఈ బడ్జెట్ ఎవరికి మోదం..? ఎవరికి ఖేదం..? లైవ్ అప్‌డేట్స్‌ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి..


Budget 2024 Announcement In Telugu: కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా ఆమె నేడు ఏడోసారి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ట్యాక్స్‌ బెనిఫిట్స్‌పై మధ్యతరగతి ప్రజలు భారీ ఆశలు పెట్టుకోగా.. జీతాల పెంపు, పే కమిషన్ ఏర్పాటు ప్రకటనలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. మరోవైపు మండుతున్న నిత్యావసర ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటానేది ఆసక్తికరంగా మారింది. బడ్జెట్‌పై ఉభయ సభల్లో చెరో 20 గంటలపాటు చర్చ జరగనుంది. ఇప్పటికే సభా నిర్వహణకు ఎజెండా ఖరారు అయింది. మోదీ 3.O బడ్జెట్ అటు అభివృద్ధి, ఇటు సంక్షేమానికి బడ్జెట్‌లో సమతూకం ఉంటుందా..? నిర్మలమ్మ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తారా..? బడ్జెట్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Updates

  • సీనియర్ సిటిజన్లకు బడ్జెట్ లో మొండిచేయి..

    మోదీ 3.0 బడ్జెట్ లో సీనియర్ సిటీజన్లకు బిగ్ ట్విస్ట్ ఎదురైంది. ఎలాంటి స్కీమ్ లు కానీ, ప్రకటన చేయక పోవడం పట్ల సీనియర్ సిటీజన్లు గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ కు ముందు సీనియర్ సిటీజన్లకు బడ్జెట్ లో  బంపర్ ఆఫర్ లు ఉంటాయని చాలా మంది భావించారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటీజన్లు ఒకింత నిరాశకు గురయినట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్ లో ఏంలేదని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

  • స్టాండర్డ్ డిడక్షన్ పెంపు..

    కేంద్ర బడ్జెట్ లో డిడక్షన్ రూ.50 నుంచి రూ.75 వేలకు పెంచారు. అదే విధంగా పాతపన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు.. LTCG పై పన్నును 10% నుంచి 12.5% కి పెంచగా, STCGని 15% నుంచి 20%కి పెంచారు. ఇదిలా ఉండగా.. క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ పెంపుదల వల్ల ప్రజలుచేసే సెవీంగ్స్ లపై ​​ప్రభావం పడుతుందని అందుకే పెట్టుబడులు తగ్గుతాయని కొందరు ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈరోజు కాస్త స్టాక్స్ లో క్షీణత కన్పించిందని కూడా అంటున్నారు. 
     

  • కొత్త పన్ను విధానంలో మార్పులు:

    సున్నా నుంచి రూ. 3 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ ఉండదు
    రూ.3-7 లక్షల వరకు 5 శాతం పన్ను
    రూ.7-10 లక్షల వరకు 10 శాతం పన్ను
    రూ.10-12 లక్షల వరకు 15 శాతం పన్ను
    రూ.12-15 లక్షల వరకు 20 శాతం పన్ను
    రూ.15 లక్షల వరకు 30 శాతం పన్ను గా నిర్ణయించారు.

     

  • Budget allocation: 2024-25: బడ్జెట్ అంచనాలు రూ. 32.07 లక్షల కోట్లు.. జీఎస్టీ కారణంగా సామాన్యులపై పన్నుభారం తగ్గిందన్నారు. బంగారం,వెండిలపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపారు.బంగారం, వెండిపై 6 శాతం, ప్లాటీనమ్ పై 6.4  శాతం కస్టమ్ డ్యూటీ తగ్గించారు.అదే విధంగా.. ఎక్స్ రే మిషిన్లపై జీఎస్టీ తగ్గింపు, 25 రకాల ఖనిజ వస్తువులపై కస్టమ్స్ తగ్గింపు,సెల్ ఫోన్ లపై 15 శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు తెలిపారు.

  • Funds for Bihar: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ లో భారీగానే నిధులు కేటాయించారు. వరదవరద నియంత్రణకు రూ.11,500 కోట్లను కేటాయించారు.అదే విధంగా..కోసి నదిపై వివిధ పథకాలలో సహాయం, భాగల్‌పూర్‌లోని పిర్‌పైంటిలో 2400 మెగావాట్ల పవర్ ప్లాంట్ కు నిధులు కేటాయించారు. దీనిలో భాగంగా.. బక్సర్‌లో గంగా నదిపై వంతెన నిర్మించనున్నారు. బుద్ధగయ, రాజ్‌గికి కొత్త రహదారి నిర్మించబడుతుంది. వైశాలీ, దర్భంగా మధ్య రోడ్డు నిర్మించనున్నారు.

    గయలో విష్ణుపాద ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. పాట్నా, పూర్నియా మధ్య ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించబడుతుంది. రాజ్‌గిర్‌లో బ్రహ్మకుండ్ పునర్వైభవం పొందుతుంది. వరద నియంత్రణ కోసం 20 పథకాలు రూపొందించారు. బుద్ధగయను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

  • Mudra scheme and MSME: ముద్ర రుణాలు రూ. 20 లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఈ శాన్య ప్రాంతాల డెవలప్ మెంట్  కోసం ఇండియా పోస్ట్ పెమెంట్ బ్యాంక్ విస్తరణ,కొత్తగా మహిళల డెవలప్ మెంట్ ప్రత్యేకంగా 3 లక్షల కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. 12 పారిశ్రామిక కారిడార్ లు మంజురు చేసినట్లు పేర్కొన్నారు.

  • Funds For Andhra pradesh: ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని నిర్మల  అన్నారు. రాయల సీమ, ఉత్తరాంధ్ర,ప్రకాశంకు నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. వెనుక బడినప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టు తొందరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. అమరావతికి డెవలప్ మెంట్ కు 15 వేల కోట్ల ప్రత్యేక సాయం ప్రకటించారు.

  • Agriculture: కొత్తగా 109 వంగడాలను ప్రవేశ పెట్టినట్లు నిర్మల తెలిపారు. కూరగాయల ఉత్పిత్తి కోసం క్లస్టర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదే విధంగా.. వ్యవసాయ రంగంలో స్టార్టప్ లను భారీగా ప్రొత్సహించినట్లు పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతూ 4 శాతంకు చేరుకుందన్నారు. మధ్యంత బడ్జెట్ లో ప్రవేశ పెట్టిన పథకాలు కంటీన్యూ చేస్తామన్నారు.

  • Nirmala Sitharaman speech: నరేంద్ర మోదీ 3.0 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేష పెట్టారు.  ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని ఆర్థిక మంత్రి నిర్మలా అన్నారు. వికసిత్ భారత్ దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బడ్జెట్ లో 9 అంశాలపై ఫోకస్ పెట్టినట్లు నిర్మల పేర్కొన్నారు.

  • Nirmala sitharaman sarry: వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ తెలుపు, మెజెంటా రంగు చీరలో మెరిశారు. ప్రతి ఏడాది నిర్మలమ్మ... బడ్జెట్ రోజు ధరించే చీరల విషయంలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండేలా చూసుకుంటారు. హ్యాండ్లూమ్ చీరలకు నిర్మలమ్మ ప్రయారిటీ ఇస్తారని సమాచారం.

  • Stocks: బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ స్టాక్ మార్కెట్ సూచీలు మాత్రం నష్టాల్లో జారుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి స్టాక్స్ లలో పలు మార్పులు సంభవిస్తున్నాయి.

  • PM modi 3.0: దేశ ప్రధాని మోదీ బడ్జెట్ సమావేశంలో పాల్గొనడానికి పార్లమెంట్ కు చేరుకున్నారు.
     

  • PM MOdi: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వర్గం పార్లమెంట్ లో సమావేశమైంది.
     

  • Nirmala sitaraman: కేంద్ర బడ్జెట్ 2024-25 కు ప్రవేశ పెట్టడానికి రాష్ట్రపతి ముర్ము ఆమోదం తెలిపారు. ఆ తర్వాత బడ్జెట్ ట్యాబ్లెట్ లతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు చేరుకున్నారు.

  • Union Budget Announcement 2024 Live Updates: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ముర్మును పిలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమర్పించనున్నారు.

  • Union Budget Announcement 2024 Live Updates: బడ్జెట్ సమర్పించే ముందు ట్రేడ్ సెన్సెక్స్ 264.33 పాయింట్లు పెరిగి 80,766.41కి చేరుకుంది. నిఫ్టీ 73.3 పాయింట్లు పెరిగి 24,582.55 వద్దకు చేరుకుంది.
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link