8 Seater Cars: ఈ మధ్య కాలంలో ఎస్‌యూవీ లేదా 7-8 సీటర్ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. సుదూర ప్రయాణాలకు, పెద్ద కుటుంబాలకు అనువుగా ఉండటమే ఇందుకు కారణం. లగేజ్ పెట్టుకునేందుకు కూడా ఆప్షన్ ఉంటుంది. 8 సీటర్ కారు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఏ కంపెనీ 8 సీటర్ కారు బెస్ట్ అనేది ఇప్పుడు పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కియా కార్నివాల్..ఇదొక ప్రీమియం ఆప్షన్ కారు. ధర కాస్త ఎక్కువైనా అధునాతన ఫీచర్లు ఉంటాయి. లగ్జరీ ఇంటీరియల్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయి. అన్నింటికీ మించి శక్తివంతమైన ఇంజన్ ఈ కారు సొంతం.  ప్రీమియం కారు కొనాలనుంటే కియా కార్నివాల్ బెస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. 


టాటా సఫారీ..ఈ కారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదొక రఫ్ అండ్ టఫ్ కారు. బడ్జెట్ కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో మూడవ వరుస చాలా స్పేసియస్ గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. సాహసాలు చేసేవారికి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎలాంటి రోడ్లపై కూడా ఇది వెళ్లిపోగలదు. 


మహీంద్రా మరాజో...8 సీటర్ విభాగంలో ఈ కారు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇందులో కేబిన్ చాలా విశాలంగా ఉంటుంది. మద్య వరుసలో కెప్టెన్ సీట్లు ఉంటాయి. ఈ కారు మైలైజ్ కూడా ఇతర 8 సీటర్ కార్లతో పోలిస్తే చాలా బెటర్. ఇది కూడా బడ్జెట్ అనుకూలంగా ఉంటుంది. పెద్ద కుటుంబానికి బెస్ట్ ఆప్షన్. 


ఎంజి హెక్టార్ ప్లస్...అద్భుతమైన ఫీచర్లు కావాలంటే ఇదే బెస్ట్ ఆప్షన్. ధర ఇతర ప్రీమియం కార్లకు తగ్గట్టే ఉంటుంది. అద్భుతమైన స్టైలిష్ డిజైన్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, స్పేసియస్ కేబిన్ ఉంటాయి. అధునాతన ఫీచర్లు ఉంటాయి. 


టొయోటా ఇన్నోవా క్రిస్టా...ఇది మహీంద్రా మరాజో కంటే కాస్త ధర ఎక్కువ. కానీ 7 లేదా 8 సీటర్ కార్లలో ఇన్నోవా అంటే ఓ నమ్మకం. క్రేజ్ ఎక్కువ. అందుకే ధర కాస్త ఎక్కువైనా వెనుకాడరు. ఇందులో ప్రయాణం చాలా ఆహ్లాదంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. విశాలమైన ఇంటీరియర్, మంచి రీసేల్ విలువ ఉన్నాయి.  లాంగ్ జర్నీస్‌లో కంఫర్ట్, డ్యూరబిలిటీ ఉండాలంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్.


Also read: Venus Transit 2024: శుక్రుడి గోచారంతో అక్టోబర్ 13 వరకూ అందరికీ దశ తిరిగిపోనుందా, ఊహించని ధనలాభం ఎవరెవరికంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.