LPG Cylinders: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ ధరల విషయంలోనే కాకుండా మరో రూపంలో కూడా షాక్ ఇవ్వనుంది. ఇక నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల వినియోగంపై కూడా నియంత్రణ రానుందని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని లక్షలాది ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇది బ్యాడ్‌న్యూస్. నిన్న మొన్నటి వరకూ ధరలు అమాంతం పెరుగుతూ ఆందోళన రేపిన గ్యాస్ సిలెండర్ ధర ఇప్పుడు మరో విధంగా ఇబ్బంది పెట్టనుందని తెలుస్తోంది. ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ల వినియోగంపై కూడా నియంత్రణ విధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. త్వరలో ఏడాదికి 15 సిలెండర్లు మాత్రమే ఇవ్వాలనే కొత్త నిబంధన రానుందని తెలుస్తోంది. లేదా నెలకు 2 కంటే ఎక్కువ సిలెండర్లు ఇవ్వకుండా నిబంధన రావచ్చు. అయితే ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా..ప్రచారం మాత్రం సాగుతోంది. 


ఏడాదికి 15 సిలెండర్లు, నెలకు 2 సిలెండర్లపై పరిమితి విధించవచ్చు. ఒకవేళ ఎవరైనా వినియోగదారుడిని నెలకు రెండు కంటే ఎక్కువ కావల్సిన పరిస్థితి ఉంటే..ఎందుకు అవసరమనే విషయంపై సంబంధిత పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. గత ఐదేళ్లలో వంట గ్యాస్ ధర 58 రెట్లు పెరిగింది. గ్యాస్ సిలెండర్ ధర వేయి రూపాయలు దాటి..సామాన్యుడి నడ్డి విరుస్తోంది. 


2017 ఏప్రిల్ 1- 2022 జూలై 6 మధ్య కాలంలో ఎల్బీజీ గ్యాస్ ధర 58 దఫాలుగా 45 శాతం పెరిగింది. 2017 ఏప్రిల్ నాటికి 723 రూపాయలున్న సిలెంండర్ ధర..జూలై 2022 నాటికి 45 శాతం పెరిగి 1053 రూపాయలైంది. 


అద విధంగా గత ఏడాదిలో గ్యాస్ సిలెండర్ ధర 26 శాతం పెరిగింది. 2021 జూలై 1 నుంచి 2022 జూలై 6 మధ్య కాలంలో 26 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది జూలైలో 834 రూపాయలున్న సిలెండర్ ధర ఇప్పుడు 1053 రూపాయలకు చేరుకుంది. వ్యాట్ ఆధారంగా గ్యాస్ సిలెండర్ ధర రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. 


Also read: Airtel Micro ATM: బ్యాంకింగ్ సేవల్లో ఎయిర్‌టెల్, మైక్రో ఏటీఎంలు ప్రారంభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook