5 Rules changed from 1st June 2023: నేటి నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ రేటు తగ్గింపు.. ఆ ధరలు పెంపు!
EV 2 Wheeler Prices Hike: జూన్ 1వ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనం మరింత ఖరీదు అయింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిపోయాయి. అదేవిధంగా బ్యాంక్ నిబంధనల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.
5 Rules Changed from June 1st 2023: నేటి నుంచి జూన్ నెల ప్రారంభమైంది. కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిపోగా.. బ్యాంకింగ్ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా పెరిగాయి. జూన్ 1వ తేదీ నుంచి మారిన నిబంధనలు ఏంటి..? గ్యాస్ ధరలు ఎంత తగ్గాయి..? వివరాలు ఇలా..
వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గింపు
ప్రతి నెలా 1వ తేదీన చమురు కంపెనీలు గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి. అందరూ అంచనా వేసినట్లే మరోసారి కమర్షియల్ సిలిండర్ ధరలను తగ్గించాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతధంగా ఉన్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.83.50 తగ్గించింది. నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 1773 రూపాయలకు లభించనుంది.
Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్
ఆర్‌బీఐ కొత్త రూల్స్
నేటి నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. అన్‌క్లెయిమ్ చేయని మొత్తాన్ని సెటిల్ చేయనుంది. దీనికి '100 దిన్ 100 పే' అని నామకరణం చేసింది. ఇప్పటికే అన్ని బ్యాంకులకు మార్గనిర్దేశకాలు జారీ చేసింది. 100 రోజుల్లో 100 అన్‌క్లెయిమ్డ్ సెటిల్‌మెంట్లు చేయనుంది. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని మొత్తం గుర్తించి.. నిజమైన యజమానికి అందజేయనున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెంపు
జూన్ 1వ తేదీ నుంచి ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాల ధరలు పెరిగాయి. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల ప్రకారం.. ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనంపై సబ్సిడీని రూ.15 వేల నుంచి రూ.10 వేలకు తగ్గించారు. ప్రభుత్వ ఉత్తర్వులు గురువారం నుంచి అమలులోకి వచ్చాయి. అంటే నేటి నుంచి ద్విచక్ర వాహనాల ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు 25 నుంచి 30 వేల రూపాయలు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
12 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు
జూన్ నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు వచ్చాయి. 2 వేల రూపాయల నోటును మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లాలంటే.. ముందుగా సెలవులను చెక్ చేసుకోండి. రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే.
దగ్గు సిరప్ ఎగుమతి
భారతీయ దగ్గు సిరప్ ఎగుమతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ విచారణ లేకుండా ఎగుమతి చేయకూడదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) స్పష్టం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దగ్గు సిరప్ పరీక్ష నివేదికను చూపించాల్సి ఉంటుంది. ఆ తరువాతే ఎగుమతికి అనుమతించనున్నారు.
Also Read: India China Border Clash: చైనా గుట్టురట్టు.. LAC వద్ద రహస్యంగా దళాల విస్తరణ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి