LPG Cylinder Price Latest News Updates: ఓవైపు నిత్యం పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు వంటగ్యాస్ సైతం చుక్కలు చూపిస్తుంది. ఈ నెలలోనే మూడోసారి ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. గురువారం నుంచి రూ.25 మేర నాన్ సబ్సిడీ సిలిండర్ ధర పెంచారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకే ఫిబ్రవరి నెలలో 4వతేదీ, 14వ తేదీన ఎల్పీజీ సిలిండర్ ధరలు(LPG Price Hike) పెరిగాయి. తాజాగా పెరిగిన ధరతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ ధర రూ.769 నుంచి రూ.794కు చేరింది. గత ఏడాది డిసెంబర్ 1నుంచి మొదలైన ఎల్పీజీ సిలిండర్ ధరల మంట ఇంకా కొనసాగుతోంది.


Also Read: Fuel prices hike: పెరుగుతున్న ఇంధన ధరలపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు


డిసెంబర్ 1న ఎల్పీజీ సిలిండర్ 14.2 కేజీల ధర రూ.594 నుంచి రూ.644కు పెరిగింది. డిసెంబర్ 15న రూ.50 పెరగడంతో రూ.694 అయింది. ఒక్క జనవరి నెలలో మాత్రం సామాన్యులకు ఊరట కల్పించారు. ఫిబ్రవరి నెలలో ఏకంగా మూడు పర్యాయాలు ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంచారు.


Also Read: Petrol Price Today: వరుసగా రెండోరోజు స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధర, లేటెస్ట్ రేట్లు ఇలా


గతంలో ఎన్నడూ లేనంతగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఫిబ్రవరి 14న రూ.50 పెరగడంతో 14.2 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.769 అయింది. అంతకుముందు ఫిబ్రవరి 4న రూ.25 మేర పెంచడంతో రూ.719 అయినట్లు ప్రకటించారు. కేవలం 10 రోజుల వ్యవధిలో రూ.100 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 


Also Read: Viral Video: ఇంధన ధరల పెంపునకు Mamata Banerjee వినూత్న నిరసన, Electric Scooterపై ప్రయాణం 


కాగా, సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి 12 ఇవ్వనున్నారు. ఆ తరువాత బుక్ చేసుకునే సిలిండర్లను ఎ లాంటి సబ్సిడీ వర్తించదు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద దేశ వ్యాప్తంగా 8 కోట్ల మందికి ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు పేద మహిళలకు అందజేయడాన్ని ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook